అందరూ గ్లోబల్ హీరోలైతే! అసలైన గ్లోబల్ స్టార్ ఎవరు?
'ఆర్ ఆర్ ఆర్' విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గ్లోబల్ స్టార్' గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 9 Aug 2024 12:30 PM GMT'ఆర్ ఆర్ ఆర్' విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గ్లోబల్ స్టార్' గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ సక్సెస్ అనంతరం చరణ్ కి హాలీవుడ్ లో సైతం అవకాశాలు రావడంతో? గ్లోబల్ స్టార్ ట్యాగ్ కి చరణ్ అన్నిరకాలుగా అర్హుడయ్యాడు. అప్పటి నుంచి చరణ్ ని అంతా గ్లోబల్ స్టార్ గానే పిలుస్తున్నారు. మరి దీన్ని చరణ్ అంగీకరించాడా? లేదా? అన్నది తెలియాలంటే 'గేమ్ ఛేంజర్' రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
'గేమ్ ఛేంజర్' టైటిల్స్ కార్డులో చరణ్ పేరు ముందు మెగా పవర స్టార్ కి బధులుగా గ్లోబల్ స్టార్ అని పడితే యాక్సెప్ట్ చేసినట్లే. ఇక చరణ్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ముందు కూడా గ్లోబల్ యాడ్ చేసి పిలవడం మొదలైంది. గ్లోబల్ ఐకాన్ అంటూ బన్నీ అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పాలి. 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకూ జాతీయ ఉత్తమ నటుడిగా ఏ తెలుగు నటుడికి అవార్డు రాలేదు. తొలిసారి టాలీవుడ్ కి ఆ గుర్తింపు తీసుకొచ్చింది బన్నీ మాత్ రమే. ఆ కోణంలో ఐకాన్ ముందు అభిమానులు గ్లోబల్ చేర్చారు. తాజాగా నటసింహ బాలకృష్ణని కూడా 'గ్లోబల్ లయన్' అంటూ అభిమాన సంఘాలు పిలచుకోవడం మొదలు పెట్టాయి. బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్తానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరిశ్రమ భారీ ఎత్తున సెప్టెంబర్ లో సెలబ్రేషన్స్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ప్రచారం చేస్తోన్న పోస్టర్లలో 'గ్లోబల్ లయన్' అంటూ పిలవడం మొదలు పెట్టారు. పోస్టర్లు కూడా వేసి ప్రచారం చేస్తున్నారు. దీంతో త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ముందు కూడా 'గ్లోబల్' రావడం ఖాయమే. 'గ్లోబల్ టైగర్' అంటూ కొత్త ట్యాగ్ తో అభిమానులు పిలుచుకునే అవకాశం ఉంది. 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత తారక్ పేరు హాలీవుడ్ లో మారుమ్రోగింది.
అతడికి అక్కడ అవకాశాలు వచ్చాయి. ఇదే కోవలో ప్రిన్స్ మహేష్ కూడా చేరుతాడు. ప్రిన్స్ ముందు గ్లోబల్ తగిలించి 'గ్లోబల్ ప్రిన్స్' మహేష్ అంటూ పిలవడం లాంఛనమే. మరి ఇంత మంది గ్లోబల్ స్టార్లు ఏర్పడితే అసలైన గ్లోబల్ స్టార్ ఎవరు? అన్నది డిసైడ్ చేయాల్సింది బాక్సాఫీస్ లెక్కలు మాత్రమే.