టైర్ -2 హీరోలకు మనోళ్లతో భారీ దెబ్బే!
ప్రభాస్..రామ్ చరణ్..ఎన్టీఆర్..బన్నీ లాంటి పాన్ ఇండియా స్టార్లకు బాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 27 April 2024 4:30 PM GMTప్రభాస్..రామ్ చరణ్..ఎన్టీఆర్..బన్నీ లాంటి పాన్ ఇండియా స్టార్లకు బాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా సినిమాలతో హిందీ మార్కెట్ లో సత్తా చాటిన నటులు వీరంతా. తొలి సినిమాతోనే వందల కోట్లు! అక్కడ మార్కెట్ నుంచి రాబట్టి మోస్ట్ వాంటెడ్ స్టార్స్ గా మారిపోయారు. ఇప్పుడా హీరోలతో నేరుగా హిందీలోనే సినిమాలు నిర్మించడానికి బడా నిర్మాతలంతా క్యూలో ఉన్నారు.
ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ తో లాంచ్ అయ్యాడు. `వార్-2` తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా లాంచ్ అవుతున్నాడు. ఆరకంగా దశాబ్ధాలుగా బాలీవుడ్ లో రాణిస్తోన్న స్టార్ హీరోలకే ధీటుగా మన హీరోలు నిలుస్తున్నారు. మహేష్ లాంటి స్టార్ కూడా బాలీవుడ్ కి వెళ్తే! సన్నివేశం ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఎలాంటి సినిమాలు చేయకుండానే బోలెడంత ప్యాన్ బేస్ సంపాదించుకున్న స్టార్ గా అతడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎస్ ఎస్ ఎంబీ 29 రిలీజ్ తర్వాత ఆ క్రేజ్ ఇంకేస్తాయికి వెళ్తుందో చెప్పాల్సిన పనిలేదు.
అయితే టాలీవుడ్ స్టార్లు బాలీవుడ్ లో దూకుడు చూపించడం! అక్కడ టైర్ -2 హీరోలకు ఇబ్బందిగా మారడం ఖాయం. వాళ్లకు రావాల్సిన అవకాశాల్ని మనోళ్లు ఎగరేసుకుపోతున్నారనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. `వార్ -2` లో హృతిక్ రోషన్ తోకలిసి ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దర్శకుడు ఆయాన్ ముఖర్జీ-హృతిక్ తారక్ అయితేనే బాగుంటుందని పట్టుబట్టి మరీ ఒప్పించారు. తారక్ ఆప్షన్ లో లేకపోతే మరో బాలీవుడ్ హీరో ఆ రోల్ చేసేవాడు.
కరణ్ జోహార్ చరణ్..ప్రభాస్ లకు ఇస్తోన్న ప్రాధాన్యత సొంత భాషలో ఉన్నా టైర్ -2,3 హీరోలకు ఇవ్వడం లేదన్న విమర్శ చాలా కాలంగా వినిపిస్తోంది. `బాహుబలి` తర్వాత ప్రభాస్ తో సినిమా కోసం ట్రై చేస్తున్నారు అన్న చర్చ మొదలైన దగ్గర నుంచే ఈ విమర్శ తెరపైకి వచ్చింది. ఇప్పుడది పీక్స్ కి చేరుతుంది. ఇప్పుడే సన్నివేశం ఇలా ఉందంటే? `గేమ్ ఛేంజర్`..`దేవర`..`పుష్ప`..`సలార్ -2` రిలీజ్ ల తర్వాత మనోళ్ల రేంజ్ నార్త్ లో ఎలా ఉంటుందో ఊహకి కూడా అందండం కష్టమే.