Begin typing your search above and press return to search.

పీరియాడిక్ స్టోరీల‌తో హీరోలంతా పేంప‌రింగ్!

పీరియాడిక్ స్టోరీలిప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ గా మారిందా? పాన్ ఇండియాలో వాటికున్న డిమాండ్ ప్ర‌త్యేక‌మా? అంటే అవుననే అనాలి

By:  Tupaki Desk   |   13 May 2024 6:11 AM GMT
పీరియాడిక్ స్టోరీల‌తో హీరోలంతా పేంప‌రింగ్!
X

పీరియాడిక్ స్టోరీలిప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ గా మారిందా? పాన్ ఇండియాలో వాటికున్న డిమాండ్ ప్ర‌త్యేక‌మా? అంటే అవుననే అనాలి. క‌థ‌ల కొత్త‌ద‌నంలో భాగంగా మేక‌ర్స్ అంతా ఇప్పుడు పీరియాడిక్ చిత్రాల‌పైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. ట్రెండింగ్ అశాల‌కంటే పీరియాడిక్ కంటెంట్ యూనిక్ గా హైలైట్ అవ్వ‌డంతో వాటికే మేక‌ర్స్ పెద్ద పీట వేస్తున్నారు. తాజాగా కొంత మంది స్టార్ హీరోలు న‌టిస్తోన్న పీరియాడిక్ చిత్రాల గురించి చూస్తే!

వాటికున్న డిమాండ్ చెప్పొచ్చు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 'క‌ల్కి 2898' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది పీరియాడిక్ స్టోరీ. కొన్ని శ‌తాబ్ధాల క్రితం నుంచి మొద‌లు పెట్టి ప్యూచ‌ర్ ఇండియాని ఇందులో చూపించ‌బోతున్నారు. అందుకోసం నాగ్ అశ్విన్ ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ చేసి...ప‌రిశోద‌న చేసి రాసుకున్న క‌థ‌. పాన్ ఇండియాలో సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈసినిమా త‌ర్వాత ప్ర‌భాస్..హ‌ను రాఘ‌వ‌పూడి తో వ‌ర‌ల్డ్ వార్ నేప‌థ్యంలో మ‌రో సినిమా చేస్తాడు.

ఆ వార్ లో అంద‌మైన ల‌వ్ స్టోరీని హైలైట్ చేస్తున్నాడు. ఇందులో పిక్ష‌న్ కూడా ఉంటుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వ‌షిష్ట తెర‌కెక్కిస్తోన్న 'విశ్వంభ‌ర' సోష‌ల్ ఫాంట‌సీ నేప‌థ్య‌మైనా అందుకు చ‌రిత్ర ఆధారెల్లో ఉన్నాయంటూ త‌న క‌థ ద్వారా చూపించ‌బోతున్నాడు. ఈ క‌థ కూడా టైమ్ ట్రావెల్ బేసిస్ లోనే న‌డుస్తుంద‌ని స‌మాచారం. ఇక రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రం కూడా పీరియాడిక్ నేప‌థ్య‌మే. స్పోర్స్ట్ నేప‌థ్యం ఈ సినిమాకి ఉన్న‌ట్లు స‌మాచారం. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల మ‌రోసారి పీరియాడిక్ కథాంశాన్నే ఎంచుకున్నారు.

గ‌తంలో ఇదే బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన 'ద‌స‌రా' మంచి విజ‌యం సాధించ‌డంతో శ్రీకాంత్ మ‌రోసారి నానిని కొన్నేళ్ల క్రితానికి తీసుకెళ్ల‌బోతున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాహుల్ సంకృత్య‌న్ మ‌రో సినిమా తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇది 1854-1978 మ‌ధ్య‌లో జ‌రిగే క‌థ‌. కొన్ని య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇందులో రాయ‌ల‌సీమ వీరుడి పాత్ర‌లో విజ‌య్ క‌నిపిస్తాడు. అలాగే మెగా మేన‌ల్లుడు సాయితేజ్ న‌వీన్ అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది 1940 బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ.

ఇక మెగా వారసుడు వ‌రుణ్ తేజ్ హీరోగా 'మ‌ట్కా' ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇది వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో 1950-80 మ‌ధ్య కాలంలో సాగే స్టోరీ. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అలాగే యువ హీరో అఖిల్ ఈసారి పంథా మార్చాడు. అనీల్ అనే కొత్త కుర్రాడితో పీరియాడిక్ నేప‌థ్య‌మున్న సినిమాకే రెడీ అవుతున్నాడు.

ఇంకా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'.. 'హ‌రోం హ‌ర‌'..'జితేంద‌ర్ రెడ్డి' సినిమాలు కూడా 1980 బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న‌వే. ప్ర‌స్తుతం ఈ చిత్రాలు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. అలాగే బాల‌య్య‌- బాబి కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా కూడా 80 బ్యాక్ డ్రాప్ స్టోరీ అని స‌మాచారం. నిఖిల్ స్వ‌యంభూ.. ది ఇండియానా హౌస్.. శ‌ర్వానంద్ కొత్త సినిమాలు కూడా పీరియాడిక్ ట‌చ్ ఉన్న క‌థ‌లే.