Begin typing your search above and press return to search.

మాస్ త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేదా?

ప్లాప్ ల్లో ఉన్న హీరోలంతా మ‌ళ్లీ మాస్ కంటెంట్ వైపు వెళ్తున్నారా? హిట్ కోసం మాస్ నే ఆప్ష‌న్ గా తీసు కుంటున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 May 2024 1:30 AM GMT
మాస్ త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేదా?
X

ప్లాప్ ల్లో ఉన్న హీరోలంతా మ‌ళ్లీ మాస్ కంటెంట్ వైపు వెళ్తున్నారా? హిట్ కోసం మాస్ నే ఆప్ష‌న్ గా తీసు కుంటున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. `ఎమ్మెల్యే` త‌ర్వాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ అన్ని డిఫ‌రెంట్ అటెంప్ట్ లు చేసి న్యూ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. `నా నువ్వు`, `118`, `బింబిసార` లాంటి సినిమాలు కళ్యాణ్ రామ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేసాయి. ఇదే వేవ్ లో `అమిగోస్`..`డెవిల్` లాంటి ప్ర‌య‌త్నాలు విమ‌ర్శ‌ల‌కు ప్ర‌శంస‌లు తెచ్చిపెట్టాయి. కానీ క‌మ‌ర్శియ‌ల్ గా పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు. దీంతో క‌ళ్యాణ్ రామ్ అలెర్ట్ అయ్యాడు.

ఇదే కంటున్యూ అయితే మార్కెట్ పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో ఛేంజ్ ది జోన‌ర్ అంటూ మ‌ళ్లీ మాస్ కంటెంట్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌దీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ 21వ సినిమా తె ర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే ప‌క్కా మాస్ చిత్ర‌మ‌ని తేలిపోయింది. క‌ళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తోన్న చిత్రంలో హైలైట్ అవుతుంది. మ‌రో హీరో అల్ల‌రి న‌రేష్ కూడా మాస్ ని న‌మ్ముకున్న‌ట్లే క‌నిపిస్తుంది.

`మ‌హ‌ర్షి` త‌ర్వాత న్యూ జాన‌ర్ సినిమాలు చేసినా న‌రేష్ కి క‌లిసి రాలేదు. దీంతో మ‌ళ్లీ కామెడీ జాన‌ర్ వైపు అడుగులు వేసాడు. అయినా ఆద‌ర‌ణ అంతంత మాత్ర‌మే. దీంతో మ‌ళ్లీ పాత రూట్లోనే వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో `బ‌చ్చ‌ల‌మ‌ల్లి` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పుష్ప త‌ర‌హా పాత్ర పోషిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. న‌రేష్ న్యూ లుక్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి గెట‌ప్ లో న‌రేష్ క‌నిపించ‌క‌పోవ‌డంతో అడియ‌న్స్ ని కొత్త ఫీల్ ని అందిస్తున్నాడు.

అలాగే యూత్ స్టార్ నితిన్ హీరోగా న‌టిస్తోన్న `రాబిన్ హుడ్` కూడా ప‌క్కా మాస్ చిత్ర‌మ‌ని తెలుస్తోంది. చాలా కాలంగా నితిన్ కి సక్సెస్ లేదు. విజ‌యం అంద‌ని ద్రాక్ష‌లాగే మారింది. చేసిన ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌లేదు. దీంతో వెంకీ కుడుమ‌ల ని రంగంలోకి దించి రాబిన్ హుడ్ చేస్తున్నాడు. ఇది ప‌క్కా వెంకీ మార్క్ ఎంట‌ర్ మాస్ టైన‌ర్. సినిమా పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. మ్యాచో స్టార్ గోపీచంద్ ప‌రిస్థితి ఇలాగే ఉంది. ఖాళీ లేకుండా సినిమాలైతే చేస్తున్నాడు గానీ, అందులో విజ‌యాలు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో `విశ్వం` సినిమా చేస్తున్నాడు. ఇది వైట్ల మార్క్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ అని స‌మాచారం. ఇలా న‌యా హీరోలంతా మ‌ళ్లీ మాస్ చిత్రాల‌తోనే థియేట‌ర్లో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నారు.