Begin typing your search above and press return to search.

టాలీవుడ్: అత్యధిక లాభాలు తెచ్చిన సినిమాలివే

దానికి తగ్గట్లుగానే టాలీవుడ్ సినిమాలు భారీ కలెక్షన్స్ ని అందుకుంటున్నాయి. ఎక్కువ భాషలలో రిలీజ్ కావడం వలన నిర్మాతలు కూడా మంచి లాభాలని ఆర్జిస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 July 2024 4:51 AM GMT
టాలీవుడ్: అత్యధిక లాభాలు తెచ్చిన సినిమాలివే
X

టాలీవుడ్ లో గత కొన్నేళ్ల నుంచి పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు అందరూ కూడా యూనివర్శల్ కథలపై ఫోకస్ చేసి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన అన్ని భాషలలో ప్రేక్షకులకి రీచ్ కావొచ్చు. అలాగే మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ కూడా పెంచుకోవచ్చని స్టార్స్ అందరూ భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే టాలీవుడ్ సినిమాలు భారీ కలెక్షన్స్ ని అందుకుంటున్నాయి. ఎక్కువ భాషలలో రిలీజ్ కావడం వలన నిర్మాతలు కూడా మంచి లాభాలని ఆర్జిస్తున్నారు.

తెలుగులో అత్యధిక ఆదాయం ఆర్జించిన సినిమాల జాబితాలో చూసుకుంటే రాజమౌళి బాహుబలి 2 మూవీ టాప్ 1లో ఉంది. ఈ సినిమాపై 352 కోట్ల బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరిగింది. 508 కోట్ల ప్రాఫిట్ ని ఈ సినిమా ద్వారా నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారు. దీని తర్వాత అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన రెండో సినిమాగా బాహుబలి 1 నిలిచింది. ఈ మూవీపైన 118 కోట్ల వ్యాపారం జరిగింది. 186 కోట్ల ప్రాఫిట్ దక్కించుకుంది. ఇక జక్కన్న మరో సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ 451 కోట్ల బ్రేక్ ఈవెన్ తో థియేటర్స్ లోకి వచ్చి 163.03 కోట్ల ప్రాఫిట్ ని అందించింది.

చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ 29.65 కోట్ల బిజినెస్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓవరాల్ గా 127.95 కోట్ల లాభాలని తెచ్చిపెట్టింది. దీని తర్వాత టాప్ 5లో డార్లింగ్ కల్కి2898ఏడీ మూవీ నిలవడం విశేషం. ఈ సినిమాపై 370 బిజినెస్ అయ్యింది. ఇప్పటి వరకు 80.40 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది. హనుమాన్ ప్రాఫిట్ ని కల్కి బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మూవీ అత్యధిక ప్రాఫిట్ సినిమాల జాబితాలో టాప్ 6లో ఉండటం విశేషం.

ఈ సినిమా 84.34 కోట్ల బిజినెస్ ని వరల్డ్ వైడ్ గా చేసింది. 75.88 కోట్ల ప్రాఫిట్ ని లాంగ్ రన్ లో అందుకుంది. రీజనల్ సినిమాగా వచ్చి అత్యధిక ప్రాఫిట్ సొంతం చేసుకున్న చిత్రంగా ఈ మూవీ ఉంది. నెక్స్ట్ జాబితాలో విజయ్ దేవరకొండ గీతాగోవిందం నిలిచింది. ఈ మూవీ 15 కోట్ల బిజినెస్ మాత్రమే చేసిన లాంగ్ రన్ లో ఏకంగా 55.43 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. టాప్ 7 హైయెస్ట్ ప్రాఫిట్ చిత్రాల జాబితాలో గీతాగోవిందం మూవీ నిలిచింది.

బాహుబలి -2: 508Cr(352CR)

బాహుబలి - 1: 186Cr(118Cr)

ఆర్ఆర్ఆర్ -163.03Cr(451Cr)

హనుమాన్ - 127.95CR(29.65CR)

కల్కి 2898ఏడీ - 80.40CR(370CR)******

అల వైకుంఠపురంలో - 75.88Cr(84.34Cr)

గీతాగోవిందం - 55.43Cr(15Cr)

ఎఫ్ 2 - 50Cr(34.5Cr)

వాల్తేరు వీరయ్య - 48.85Cr(88Cr)

రంగస్థలం - 47.52Cr(80Cr)