Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ను తిట్టినందుకు.. 'ఇంద్ర' రైటర్ సారీ

సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు, ఇంద్ర లాంటి సినిమాలతో స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న చిన్నికృష్ణ అందరికి సుపరిచితమే

By:  Tupaki Desk   |   2 Feb 2024 5:53 AM GMT
మెగాస్టార్ ను తిట్టినందుకు.. ఇంద్ర రైటర్ సారీ
X

సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు, ఇంద్ర లాంటి సినిమాలతో స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న చిన్నికృష్ణ అందరికి సుపరిచితమే. ప్రస్తుతం అయితే ఆయన సినిమాలకి కథలు రాయడం లేదు. చివరిగా అతను జీనియస్ అనే మూవీకి కథ అందించాడు. అయితే 2019 ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద చిన్నికృష్ణ చేసిన విమర్శలు సంచలనంగా మారాయి.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ అతను తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ పైన కూడా విమర్శలు చేశారు. వైసీపీకి సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ మీద అప్పట్లో చిన్నికృష్ణ విమర్శలు చేశారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ అతని విమర్శలపై రియాక్ట్ కాలేదు. వాటిని అందరూ మరిచిపోయారు. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మవిభూషణ్ ప్రకటించింది.

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, వర్ధమాన తారలు అందరూ కూడా మెగాస్టార్ కి కలిసి విషెస్ చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం అందరూ కలిసి అభినందన సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దానికి సంబందించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా రైటర్ చిన్నికృష్ణ కూడా మెగాస్టార్ చిరంజీవిని కలిసి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా విషెస్ చేశారు.

తరువాత ఒక వీడియో రిలీజ్ చేసి గతంలో మెగాస్టార్ పై తాను చేసిన విమర్శలకి క్షమాపణలు చెప్పారు. గతంలో కొంతమంది ప్రభావితం చేయడం వలన తాను చిరంజీవిని అనకూడని మాటలన్నీ అన్నానని, విమర్శలు చేశానని, వాటిపై నా కుటుంబలో అందరూ నన్ను నిందించారని వీడియోలో పేర్కొన్నాడు. అప్పటి నుంచి తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ మనోవేదనకి గురవుతూనే ఉన్నానని అన్నారు.

తాజాగా చిరంజీవి గారిని కలిసి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా విషెస్ చేశానని, ఆయన సాదరంగా నన్ను ఆహ్వానించి, ఆత్మీయంగా మాట్లాడారని తెలిపారు. కథలు ఏమైనా రాస్తున్నావా అని అడిగారని, కలిసి పనిచేద్దామని చెప్పారని చిన్నికృష్ణ వీడియోలో పేర్కొన్నారు. తాను అన్న మాటలకి మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని వీడియోలో తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.