Begin typing your search above and press return to search.

ఇక హ్యాపీగా..జాలీగా జీవితం!

ధాప‌త్య జీవితాలు ఎలా విచ్చిన్నం అవుతున్నాయో క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   11 Sep 2023 1:30 AM GMT
ఇక హ్యాపీగా..జాలీగా జీవితం!
X

ధాప‌త్య జీవితాలు ఎలా విచ్చిన్నం అవుతున్నాయో క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది. భార‌తదేశంలో ఈ రేషియో 50 శాతంగా క‌నిపిస్తుంది. ఎవ‌రికి వారు వారు స్వేచ్ఛాయుత జీవితానికే ఇష్ట‌ప‌డుతున్నారు. వివాహ వ్య‌వ‌స్థ‌కే మ‌చ్చ తెచ్చేలా కొన్ని జీవితాలు క‌నిపిస్తున్నాయి. పెళ్లి అనేది నూరేళ్ల పంట‌కాదు..మూడు నాళ్ల ముచ్చ‌ట అనిపిస్తున్నారు. దీనిపై నిత్యం సోష‌ల్ మీడియాలో..టీవీ ఛానల్స్ లో న‌డిచే డిబేట్లు అంతే ఆస‌క్తిక‌రం.

ఇదే విష‌యాన్ని సెల‌బ్రిటీల‌కు ముడి పెట్టి మాట్లాడితే దేశంలో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంద‌ని చెప్పాలి. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఈ ర‌క‌మైన తంతు నిత్యం క‌నిపిస్తూనే ఉంది. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే కొన్ని కుటుంబాల్లో ఇది స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఇటీవ‌లే ఓ పెద్దింటి అమ్మాయి..నటి విడాకుల బంధంతో ధాంప‌త్య జీవితానికి చ‌ర‌మ గీతం పాడిన సంగ‌తి తెలిసిందే. ఆ కార‌ణంగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు ఆమె.

ప్ర‌స్తుతం ఆమె ఎంతో స్వేచ్ఛ‌గా జీవితాన్ని ఆస్వాదిస్తుంది. తాను కోరుకున్న రంగుల ప్ర‌పంచం వైపు మ‌ళ్లీ అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం. పూర్తి స్థాయిలో న‌టిగా మారి త‌న‌దైన ముద్ర వేయాల‌ని త‌హ‌త‌హ‌లా డుతుందిట‌. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే ఆ కుటుంబం కుమార్తెకి మ‌ళ్లీ పెళ్లి చేయాలని భావించిన‌ట్లు..ఈ విష‌యం ఆమె దృష్టికి తీసుకెళ్తే ఆమె నుంచి ఈసారి నెగిటివ్ స‌మాధానం వ‌చ్చిందిట‌. మ‌ళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో లేన‌ని కెరీర్ పైనే ఫోక‌స్ పెడ‌తాన‌ని క‌రాఖండీగా చెప్పేసిందిట‌.

ఇలాంటి బ‌ధులు వెళ్ల‌డానికి కూడా ఓ కార‌ణం ఉందంటున్నారు. మొద‌టి పెళ్లి విష‌యంలోనే ఆ న‌టి అసంతృప్తిగా ఉండేద‌ట‌. కానీ కుటుంబ స‌భ్యుల మాట‌లు కాద‌న‌లేక‌..కొట్టేయ‌డం ఇష్టం లేక అప్పుడు త‌ల వొంచి తాళి క‌ట్టించుకున్న‌ట్లు గుస గుస వినిపిస్తోంది. మ‌ళ్లీ అలాంటి త‌ప్పు రిపీట్ అవ్వ‌డానికి ఛాన్స్ లేద‌ని ఈసారి గట్టిగానే ప‌ట్టు ప‌ట్టిందిట‌.