Begin typing your search above and press return to search.

గత ఐదేళ్ళలో టాలీవుడ్ లో గుర్తుకొచ్చే బెస్ట్ మూవీ షాట్స్

బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా స్టాండర్డ్స్ మారిపోయింది. క్వాలిటీ కంటెంట్ తో సినిమాలు చేసే దర్శకులు ఎక్కువయ్యారు

By:  Tupaki Desk   |   2 July 2024 4:17 AM GMT
గత ఐదేళ్ళలో టాలీవుడ్ లో గుర్తుకొచ్చే బెస్ట్ మూవీ షాట్స్
X

బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా స్టాండర్డ్స్ మారిపోయింది. క్వాలిటీ కంటెంట్ తో సినిమాలు చేసే దర్శకులు ఎక్కువయ్యారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కనిపించేవి. కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసే హీరోలు కూడా కమర్షియల్ ఫార్ములానే ఫాలో అయ్యి మూవీస్ చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం బలమైన, కథ, కథనాలతో మూవీస్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా స్టోరీలో భాగంగానే ఉండాలని అనుకుంటున్నారు.

కథలో దమ్ముంటే హీరోగా చేసేవారికి ఆటోమేటిక్ గా ఎలివేషన్ వస్తుందని అందరూ నమ్ముతున్నారు. అలాగే పాన్ ఇండియా ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా కొనసాగుతోంది. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారు. ఇక డైరెక్టర్స్ అయితే మైథలాజీని ఎడాప్ట్ చేసుకొని కథలు రాస్తున్నారు. మూవీస్ తో మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండటంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే గత ఐదేళ్ల కాలంలో టాలీవుడ్ సినిమాలలో కనిపించిన బెస్ట్ ఎలివేషన్ షాట్స్ అంటే కొన్ని సినిమాలు గుర్తుకొస్తాయి. వాటిలో తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ మూవీలో లార్డ్ కృష్ణ ఎలివేషన్ షాట్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బాంబ్స్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ విజువల్ ప్రెజెంటేషన్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిన హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి స్టాట్యూ, వాటర్ ఫాల్ ఎలివేషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. ప్రతి ఒక్కరు సినిమాకి కనెక్ట్ అయ్యేలా ఈ ఎలివేషన్ షాట్స్ చేశాయి.

బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్ గ్యాంగ్ తో టెంపుల్ దగ్గర యుద్ధం చేసినపుడు రథం చక్రాన్ని తీసి బాలయ్య పైకి ఎత్తుతాడు. ఆ షాట్ బోయపాటి సినిమాలలో నెవ్వర్ బిఫోర్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ ఎలివేషన్ తో పాటు పవర్ ఫుల్ మైథాలజీ టచ్ అఖండ సినిమాకి రావడానికి అది హెల్ప్ అయ్యింది. అఖండ అంటే వెంటనే అందరికి గుర్తుకొచ్చేది ఆ షాట్ అని చెప్పొచ్చు.

ఇక రాజమౌళి సృష్టించిన ఆర్ఆర్ఆర్ లో ఫారెస్ట్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ ని డార్క్ లైట్ లో ఎలివేట్ చేస్తారు. ఈ షాట్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. అంత వరకు కథలో పోలీస్ యూనిఫామ్ లో కనిపించిన రామ్ చరణ్ అల్లూరిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యే ఆ షాట్ ప్రతి ఒక్కరికి గూస్ బాంబ్స్ క్రియేట్ చేసింది. అలాగే కొమరం భీమ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ కావడానికి కారణం అయ్యింది. ఈ షాట్స్ సెలక్షన్స్ ఎవరిదైనా సినిమాని మాత్రం పీక్స్ లో నిలబెట్టాయని చెప్పొచ్చు.