Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం.. టాప్ సినిమాలివే!

ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898ఏడీ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ దిశగా దూసుకుపోతోంది. కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   5 July 2024 3:42 AM GMT
బాక్సాఫీస్: తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం.. టాప్ సినిమాలివే!
X

తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరుగుతూ పోతోంది. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఎక్కువగా యూనివర్సల్ కథలతోనే సినిమాలు చేస్తున్నారు. టైర్ 2 హీరోలు సైతం డిఫరెంట్ అప్రోచ్ లోనే కథలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898ఏడీ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ దిశగా దూసుకుపోతోంది. కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది.

బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెరిగింది. నిర్మాతలు కూడా వందల కోట్ల బడ్జెట్ తో మూవీస్ చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే మన సినిమాలు కలెక్షన్స్ పరంగా కూడా టాప్ లో ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా టాప్ స్టార్స్ నుంచి వచ్చే సినిమాలకి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం (7 రోజుల్లో) అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ టాప్ ప్లేస్ లో ఉంది.

ఈ మూవీ మొదటి వారం ఏకంగా 187.65 కోట్ల షేర్ అందుకుంది. దీని తర్వాత స్థానంలో కల్కి 2898ఏడీ మూవీ నిలిచింది. ఈ సినిమా మొదటి వారం ఏకంగా 135.32+ కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోగలిగింది. దీని తర్వాత స్థానంలో ప్రభాస్ సలార్ మూవీ నిలిచింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి ఏడురోజుల్లో 128.54 కోట్ల షేర్ వసూళ్లని సాధించింది.

తరువాత నాలుగో స్థానంలో బాహుబలి 2 ఉంది. ఈ చిత్రం 117.92 కోట్ల షేర్ ని మొదటి వారం రోజుల్లో అందుకుంది. దీని తర్వాత రీజనల్ మూవీగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో టాప్ 5లో ఉంది. ఈ చిత్రం మొదటి వారం 88.25 కోట్ల షేర్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుంది. కల్కి మూవీ కలెక్షన్స్ పరంగా టాప్ 4లో ఉన్న చిత్రాలన్నింటిని బ్రేక్ చేసి టాప్ 2 లోకి వచ్చింది.

ఓవర్సీస్ లో కూడా కల్కి మూవీ కలెక్షన్బ్ పరంగా తెలుగు సినిమాల రికార్డులని బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఒక్క ఆర్ఆర్ఆర్ రికార్డ్ ని మాత్రమే టచ్ చేయలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. శుక్రవారం, శని, ఆదివారాలు మరల కల్కి మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ వారం పెద్దగా రిలీజ్ లు లేవు. బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ మూవీ ఒకటే ఉంది. దాని ప్రభావం కల్కి సినిమా కలెక్షన్స్ పై ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఆర్ఆర్ఆర్- 187.65CR

కల్కి2898ఏడీ - 135.32CR*****

సలార్- 128.54Cr

బాహుబలి 2- 117.92Cr

అల వైకుంఠపురములో- 88.25Cr

సరిలేరు నీకెవ్వరూ– 84.82Cr

సై రా- 84.49Cr

గుంటూరుకారం- 81.31Cr

వాల్తేరు వీరయ్య- 79.86CR

సర్కారువారిపాట - 78.90Cr

ఆదిపురుష్– 75.27CR

సాహో– 74.92Cr