మళ్లీ ఆయన ఆ గూటికి చేరాల్సిందేనా?
అదృష్టం ఒక్కసారే తలుపు తడితే దురదృష్టం తలుపు తీసే వరకూ తడుతూనే ఉంటుంది.
By: Tupaki Desk | 14 Aug 2023 3:00 AM GMTఅదృష్టం ఒక్కసారే తలుపు తడితే దురదృష్టం తలుపు తీసే వరకూ తడుతూనే ఉంటుంది. అందుకే ఉన్న సమయాన్ని..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మళ్లీ పరిస్థితి మొదటికే వస్తుంది. పోటీ ప్రపంచంలో ఛాన్స్ రావడం అన్నది అదృష్టం. ఆ తర్వాత నిలబెట్టుకోవాల్సింది వాళ్ల సామార్ధ్యాల పైనే ఆధారపడి ఉంటుంది. తాజాగా ఓ దర్శకుడి సామర్ధ్యం మరోసారి ప్రూవ్ అయింది.
ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన గొప్ప అవకాశం అది. అలాంటి ఛాన్స్ కోసం ఎన్నో ఏళ్లు..ఎంతో అనుభవం ఉంటే గానీ రాని ఛాన్స్ అది. అందులోనూ కెరీర్ ముగిసిపోయిందనుకున్న సమయంలో ఆ దర్శకుడికి అవకాశం వచ్చింది. హిట్ ఇస్తే అతని జీవితం కొత్త టర్నింగ్ తీసుకునేది. కానీ వచ్చిన ఆ గోల్డెన్ ఛాన్స్ ని
చేజారా వదులుకున్నాడు. ఆయన చేసిన సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలే కపోయింది. దీంతో ఆ దర్శకుడు మళ్లీ ఆ గూటికి చేరుకోక తప్పదా? అంటే అవుననే అనుననే టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం హీరోలెవ్వరూ ఛాన్స్ ఇవ్వడం లేదు. హిట్ ఇచ్చిన దర్శకులకే హీరోలు డేట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. అందులో ప్లాప్ దర్శకుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. హీరోలతో ఎంత సాన్నిహిత్యం ఉన్న కనీసం స్టోరీ కూడా వినకుండా ముఖం చాటేసే వారెంతో మంది ఉన్నారు. గతంలో అందించిన విజయాలు ఇక్కడ కొలమానం కాదు. ప్రస్తుతం ఏంటి? అన్నదే హీరోలు చూస్తారు.
పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడికే హీరోలు ముఖం చాటేస్తున్నారంటే? సన్నివేశం ఎలా ఉందో గెస్ చేయోచ్చు. ఈ నేపథ్యంలో ఆ నయా దర్శకుడు పాత వృత్తిలోకి వెళ్లడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. తాజా సినిమా కంటే ముందు కొన్నేళ్ల పాటు ఓ స్టార్ హీరో కుటుంబంతో ఉన్న బాండింగ్ కారణంగా వాళ్లకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునేవారు. అలాగే కొన్ని డిపార్ట్ మెంట్ లో క్రియేటివ్ హెడ్ గానూ పనిచేసారు. ఆరకంగా ఆ కుటుంబంతో మంచి బంధం ఏర్పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ బ్యాక్ టూ పెవిలియన్ తప్పదనిపిస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఏదైనా సినిమా చేస్తే గనుక అది సంచలనమే అవుతుంది.