Begin typing your search above and press return to search.

తారక్ vs పవన్.. సాధ్యమేనా?

ఇలా పోటీ పడే సమయంలో ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:40 AM GMT
తారక్ vs పవన్.. సాధ్యమేనా?
X

స్టార్ హీరోల సినిమాలు ఒకే సారి రిలీజ్ కావడం అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. ఇలా పోటీ పడే సమయంలో ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తమ మార్కెట్ పరిధి పెంచుకుంటూ యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అలా వచ్చిన తర్వాత టాలీవుడ్ లో సక్సెస్ రేట్ కూడా పెరిగింది.

అలాగే సినిమాలకి ఓటీటీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నాలుగు, ఐదు భాషలలో రెడీ అవుతున్న సినిమాలకి డిజికల్ రైట్స్ ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. దీంతో మన హీరోలు, దర్శకులు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. రాజమౌళి క్రియేట్ చేసిన పాన్ ఇండియా మార్కెట్ లోకి టాలీవుడ్ స్టార్స్ అందరూ వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంచుమించు అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ కూడా రిలీజ్ కాబోతూ ఉండటం విశేషం. మార్చి 22న ఈ చిత్రం రిలీజ్ కానుందంట.

దీనిని ఇద్దరి మధ్య పెద్దగ్యాప్ అయితే లేదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడ్డారు. రోజుల గ్యాప్ లో వారి సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలు, నా అల్లుడు ఒకే టైంలో రిలీజ్ కాగా కొంతలో కొంత బాలు పర్వాలేదనిపించుకుంది. తరువాత రాఖీ, అన్నవరం పోటీ పడ్డాయి.

వీటిలో రాఖీ సినిమాకి మంచి టాక్ వచ్చింది. తరువాత గబ్బర్ సింగ్, దమ్ము ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. అలాగే అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా సినిమాలు పోటీ పడ్డాయి. మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు పది రోజుల గ్యాప్ లో రాబోతున్నాయి. వీటిలో ఏది విన్నర్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.