పోటీపై బాలయ్య అలా.. రవితేజ ఇలా!
వివరాళ్లోకి వెళితే... లియో సినిమా గురించి కాస్త పక్కనపెడితే.. టాలీవుడ్లో భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు మధ్య గట్టి పోటీ నెలకొంది
By: Tupaki Desk | 16 Oct 2023 7:57 AM GMTఈ దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు త్రిముఖ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. మరో మూడు నాలుగు రోజుల్లో బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఈ పోటీపై బాలయ్య - రవితేజ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మాస్ మాహారాజ్ ఒకలా మాట్లాడితే.. నటసింహం మరోలా మాట్లాడటం ప్రస్తుతం కాస్త చర్చనీయాశంమైంది.
వివరాళ్లోకి వెళితే... లియో సినిమా గురించి కాస్త పక్కనపెడితే.. టాలీవుడ్లో భగవంత్ కేసరి - టైగర్ నాగేశ్వరరావు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఒక్కరోజు గ్యాప్‌లో రెండు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. దీంతో ఇరు చిత్రబృందాలు ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాయి. వరుస అప్డేట్స్, ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి.
తాజాగా టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అలాగే ఇతర కొన్ని విషయాలను గురించి రవితేజ మాట్లాడారు. తన సినిమాతో పాటు విడుదలవుతున్న ఇతర సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. "నా బ్రదర్ లాంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా, మా బాలయ్య బాబు సినిమా భగవంత్ కేసరి కూడా రిలీజ్ అవుతోంది. రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సమయంలో విజయ్ లియో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను." అని పేర్కొన్నారు.
అంతకుముందు బాలయ్య పోటీ గురించి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. "ఛాలెంజ్ పోటీ లేనిదే ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. అయినా మాకు మేమే పోటీ. నాకు ఎవరూ పోటీ లేరు. ఎవరినీ పట్టించుకోను. నా సినిమాలు నాకే పోటీ." అని చెప్పారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మాట్లాడిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
రవితేజ మాట్లాడిన కామెంట్స్ పాజిటివ్ వైబ్‌లో ఉన్నప్పటికీ.. బాలయ్య కామెంట్స్ కొంతమందికి కాస్త గట్టిగా అనిపించాయి! కానీ ఆయన సందర్భానికి తగ్గట్టుగా పాజిటివ్ వేలోనే మాట్లాడారని, తన సినిమా తనకే పోటీ అనే అన్నారు కానీ, ఎవరినీ కించపరచలేదని మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో వీరిద్దరు అన్‌స్టాపబుల్‌లో కలిసి ఎంత సరదాగా మాట్లాడుకున్నారో తెలిసిన విషయమే. ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. కాబట్టి బాలయ్య కామెంట్స్‌లో తప్పు బట్టడానికి ఎలాంటి ఆస్కారం లేదనే చెప్పాలి.