Begin typing your search above and press return to search.

టాలీవుడ్: సంక్రాంతి ఫైట్ ను తేల్చబోతున్న దసరా

ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే స్టార్ హీరోలు తమ సినిమాలతో రిలీజ్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం వరకు ఒకే

By:  Tupaki Desk   |   19 Oct 2023 4:20 AM GMT
టాలీవుడ్: సంక్రాంతి ఫైట్ ను తేల్చబోతున్న దసరా
X

ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే స్టార్ హీరోలు తమ సినిమాలతో రిలీజ్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఒకేసారి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం వరకు ఒకే. కాని ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఒకేసారి నాలుగు, ఐదు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అనుకున్న డేట్ కి అవుట్ పుట్ రెడీ కాకపోవడం వలన దర్శక, నిర్మాతలు రిలీజ్ వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు.

ఈ కారణంగా అప్పటికే ఒక డేట్ కి ఏదో ఒకటి, రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యి ఉంటారు. అయితే పెద్ద సినిమాల నిర్మాతలు ఆ డేట్ ని లాక్ చేస్తారు. ఇలా స్టార్స్ తమ సినిమాలకి సంబందించిన రిలీజ్ డేట్స్ ఎప్పుడు పడితే అప్పుడు లాక్ చేయడం వలన అప్పటికే ఆ డేట్ ఫిక్స్ చేసుకొని ఉన్న మీడియం రేంజ్, లో బడ్జెట్ మూవీస్ మళ్ళీ తమ సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.

అయితే కొంతమంది పెద్ద హీరోలు మాత్రం ఇలాంటి పోటీ వచ్చిన వెనక్కి తగ్గేందుకు సిద్ధపడటం లేదు. ఈ దసరాకి ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, తమిళంలో లియో, హిందీ లో గణపత్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఇవి వేటికవే ప్రతికమైనవి కావడం విశేషం. అయితే ఇలా ఒకేసారి నాలుగు మూవీస్ రిలీజ్ కావడం వలన టఫ్ ఫైట్ సినిమాల మధ్య నడుస్తోంది.

కోలీవుడ్ లో టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి కేవలం 30 థియేటర్స్ మాత్రమే దొరికాయంట. దీనిని బట్టి అక్కడ లియో ఆధిపత్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ దసరా రేసులో పోటీ పడుతున్న సినిమాలు అన్ని పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఏ ఒక్క సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. ప్రేక్షకులు ఏదో ఒక మూవీని ఛాయస్ గా ఎంచుకునే అవకాశం ఉంది.

వాళ్ళ టేస్ట్ కి తగ్గ మూవీని చూడటానికి థియేటర్ కి వెళ్తారు. మూడు సినిమాలు హిట్ అయిన అన్ని చూడాలని అనుకోడు. డానికి కారణం టికెట్ రేట్స్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ దసరా సీజన్ పెద్ద సినిమాలు ఒకేసారి పోటీ పడితే ఎలాంటి ప్రతిఫలం ఉంటుందనేది డిసైడ్ చేసేస్తుంది. దానిని బట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో పోటీ పడుతున్న ఐదు సినిమాలలో కొన్ని వెనక్కి తగ్గొచ్చు.

సంక్రాంతికి గుంటూరు కారం అనే పెద్ద సినిమా వస్తున్నప్పటికీ మరోవైపు నాగార్జున నా సామి రంగ, రవితేజ ఈగల్ కూడా భారీ స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. అలాగే హనుమాన్ కూడా అదే పండగను టార్గెట్ చేసింది. ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా సంక్రాంతిని ఫిక్స్ చేసుకుంది. ఈ పోటీ లో థియేటర్లో అడ్జస్ట్మెంట్ విషయంలో కొంత ఇబ్బందులు రాక తప్పదు. ఏది ఏమైనప్పటికీ ఫెస్టివల్ లో పోటీ పడితే కంటెంట్ బాగున్నప్పటికీ కూడా ప్రభావం తప్పదు. ఇక ఈ దసరా సమయం లో ఫలితాలను బట్టి సంక్రాంతి సినిమాల భవిష్యత్తు పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.