టాలీవుడ్ అంటేనే సినిమాల సందడి..!
అయితే ఈ సినిమాల హడావుడి కేవలం టాలీవుడ్ వరకే కాదు ఇండియా వైడ్ ఉందని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 18 Jan 2024 9:30 AM GMTప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే అందరు కూడా టాలీవుడ్ వైపు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో మన స్టార్స్ చేస్తున్న అద్భుతాలు ఒక కారణమైతే.. ఏదైనా ఫెస్టివల్ వస్తే మన సినిమాలు చేసే సందడి మరో కారణమని చెప్పొచ్చు. న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి సీజన్ అంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద పండుగ. ఓ పక్క ప్రజలంతా సంక్రాంతి పండుగతో పాటు సినిమా పండుగ కూడా జరుపుకుంటారు. ఇక ప్రేక్షకుల ఎదురుచూపులకు తగినట్టుగానే స్టార్స్ తమ సినిమాను రిలీజ్ చేస్తుంటారు. సంకాంతి సినిమాల్లో స్టార్స్ అందరికీ తమదైన రికార్డులు ఉన్నాయి.
ఎప్పటిలానే ఈ సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు తెలుగు బాక్సాఫీస్ పై సందడి చేశాయి. అయితే ఈ సినిమాల హడావుడి కేవలం టాలీవుడ్ వరకే కాదు ఇండియా వైడ్ ఉందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల సందడి అంటే అది కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. సంక్రాంతికి రిలీజైన సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం సినిమాను కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు వెర్షన్ రిలీజైన పక్క రాష్ట్రాల వారు ఎంజాయ్ చేశారు. గుంటూరు కారం రిలీజ్ టైం లో చెన్నై, బెంగుళూరు ఏరియాల్లో కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హంగామా తెలిసిందే.
ఇక ఈ సంక్రాంతికి పాన్ ఇండియా రిలీజైన హనుమాన్ గురించి నేషనల్ వైడ్ గా చర్చ జరిగింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఓ పక్క రామ మందిరం ఏర్పాటు జరుగుతుండగా కరెక్ట్ టైం కి హనుమాన్ రావడం అంతా అలా యాదృచ్చికంగా జరిగింది. ఈ మూమెంట్ హనుమాన్ సినిమాకు బాగా కలిసి వచ్చింది. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో యునానిమస్ హిట్ గా హనుమాన్ నిలిచింది.
సంక్రాంతికి రిలీజైన వెంకటేష్ సైంధవ్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా మాత్రం ఎక్కడ తన మార్క్ చూపించలేదు. ఇక నాగార్జున నా సామిరంగ మాత్రం తెలుగు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తెలుగులో రిలీజైన ఈ నాలుగు సినిమాల గురించే నేషనల్ వైడ్ గా డిస్కషన్ నడిచింది. సంక్రాంతికి తమిళంలో ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. వాటి కన్నా తెలుగు సినిమాల గురించే నేషనల్ మీడియా కూడా ఎక్కువ కవర్ చేసింది.
పాన్ ఇండియా రిలీజ్ కాదు కేవలం తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి కూడా ముంబై మీడియా స్పెషల్ కవరేజ్ చేస్తుంది. తెలుగు మార్కెట్ గురించి ఇక్కడ సినిమాలు చేస్తున్న హడావుడి గురించి నేషనల్ మీడియా స్పెషల్ ఫోకస్ చేస్తుంది. సంక్రాంతి సీజన్ లో అయితే దేశం మొత్తం కూడా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకున్నాయంటే అతిశయోక్తి కాదు.