Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో నెక్స్ట్ 7 నెలలు ఫుల్ హంగామా

ప్రతి నెల ఒక భారీ బడ్జెట్ చిత్రం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుని ప్రేక్షకులు ముందుకి రాబోతోంది.

By:  Tupaki Desk   |   29 May 2024 3:59 AM GMT
టాలీవుడ్ లో నెక్స్ట్ 7 నెలలు ఫుల్ హంగామా
X

2024 ప్రధమార్ధంలో టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ పాన్ ఇండియా సినిమాలు రాలేదు. ఒక హనుమాన్ మాత్రమే సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే ఈ ఐదు నెలల కాలంలో రిలీజ్ అయ్యాయి. వీటిలో ఓ రెండు, మూడు చిత్రాలు తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో ఏవి లేవు. జూన్ నుంచి టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హంగామా మొదలవుతోంది.

ప్రతి నెల ఒక భారీ బడ్జెట్ చిత్రం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుని ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. వీటిలో ఫస్ట్ వచ్చే చిత్రంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఉంది. ఈ సినిమా జూన్ 28న వరల్డ్ వైడ్ గా 22 భాషలలో రిలీజ్ కాబోతోంది. కచ్చితంగా ఈ మూవీ 1000 కోట్లకు పై కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. జూలై 12న శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

ఈ సినిమా పైన కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగస్టు 15న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఓజీ థియేటర్స్ లోకి వస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో సుజిత్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ పై ఆవిష్కరించే పనిలో ఉన్నారు.

అక్టోబర్ 10న యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్ ప్యాక్డ్ పాన్ ఇండియా మూవీ దేవర ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి రెడీ అవుతోంది. నవంబర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ కమర్షియల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. శంకర్ తెలుగులో ఫస్ట్ చేస్తున్న మూవీ ఇదే కావడంతో ఎక్స్పెక్టేషన్ హై ఎండ్ లో ఉండటం విశేషం.

డిసెంబర్ నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రెడీ అవుతోన్న ఈ మూవీ 500 ఏళ్ళ క్రితం కథతో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో 150+ కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం గమనార్హం. వీటిలో ఏ చిత్రం అత్యధిక ప్రజాధారణ సొంతం చేసుకుంటుందనేది వేచి చూడాలి.