2024 బాక్సాఫీస్.. టాప్ రికార్డులు తిరగరాసే సినిమాలు
ఇప్పుడు స్టార్ హీరోల నుంచి 200 కోట్ల నుంచి 600 కోట్ల మధ్య బడ్జెట్ లతో నిర్మితమవుతోన్న సినిమాలు రాబోతున్నాయి
By: Tupaki Desk | 25 March 2024 5:04 AM GMTబాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ లో పాన్ ఇండియా కల్చర్ బాగా పెరిగింది. డిజిటల్ మార్కెట్ కూడా బూస్ట్ ఇవ్వడంతో భారీ బడ్జెట్ లు పెట్టి మినిమమ్ ఐదు భాషలలో సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకల్ కంటే ఉన్నా కూడా కొన్ని చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తోంది. బాహుబలి తర్వాత తెలుగు నుంచి పాన్ ఇండియా లెవల్ లో ప్రూవ్ చేసుకున్న మూవీస్ అంటే ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2, సలార్, హనుమాన్ కనిపిస్తాయి.
ఇప్పుడు స్టార్ హీరోల నుంచి 200 కోట్ల నుంచి 600 కోట్ల మధ్య బడ్జెట్ లతో నిర్మితమవుతోన్న సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలన్నింటిపైన భారీ అంచనాలు నెలకొని ఉండటం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ తెరకెక్కుతోంది. డివివి దానయ్య సినిమాపై 150 కోట్లకి పైగా బడ్జెట్ పెడుతున్నారు. పాన్ ఇండియా లెవల్ లో 300 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో ఈ సినిమా రెడీ అవుతోంది. సుజిత్ కి సాహోతో వచ్చిన ఇమేజ్ ఒజీకి కలిసొచ్చే అవకాశం ఉంది.
ఓజీ టార్గెట్ కలెక్షన్స్ అందుకుంటే మాత్రం పవర్ స్టార్ కెరియర్ లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలించే అవకాశం ఉంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ ఈ ఏడాదిలో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసే సినిమాగా అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 500 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ క్లిక్కయితే 1000 కోట్లకి పైగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మూవీ దసరాకి రిలీజ్ కానుంది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో తారక్ ఉన్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోయే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే 500 నుంచి 700 కోట్ల మధ్యలో కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ మూవీని దిల్ రాజు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతోన్న ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే 400 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీని 300 కోట్ల బడ్జెట్ తో సుకుమార్ గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.
ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఏ విధంగా చూసుకున్న ఏ ఏడాది టాలీవుడ్ సినిమాలే కలెక్షన్స్ పరంగా టాప్ చైర్ లో ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే కంటెంట్ తో మెప్పించడం కంటే ముందు ప్రమోషన్స్ తో హైప్ క్రియేట్ చేయడం అసలైన టాస్క్. మరి మన హీరోలు ఏ లెవెల్లో రికార్డులను తిరగరాస్తారో చూడాలి.