Begin typing your search above and press return to search.

సమ్మర్ బాక్సాఫీస్.. గతేడాది కన్నా దారుణంగా!

తెలుగు సినిమాలకు వేసవి సీజన్ ఒక పండుగ లాంటిది. సంక్రాంతి తర్వాత సమ్మర్ లో అనేక మూవీలు రిలీజ్ అవుతుంటాయి

By:  Tupaki Desk   |   15 May 2024 12:09 PM GMT
సమ్మర్ బాక్సాఫీస్.. గతేడాది కన్నా దారుణంగా!
X

తెలుగు సినిమాలకు వేసవి సీజన్ ఒక పండుగ లాంటిది. సంక్రాంతి తర్వాత సమ్మర్ లో అనేక మూవీలు రిలీజ్ అవుతుంటాయి. ఎక్కువ రోజులు సెలవులు ఉండడంతో మేకర్స్ అప్పుడే తమ చిత్రాలను రిలీజ్ చేస్తుంటారు. బడా హీరోలు కూడా సమ్మర్ లోనే తమ సినిమాలతో వచ్చేందుకు ఇష్టపడతారు. చెప్పాలంటే మార్చి లాస్ట్ నుంచే బాక్సాఫీస్ వద్ద హంగామా స్టార్ట్ అయిపోతుంది. పరీక్షలు అయ్యాక విద్యార్థులంతా సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.

అందుకే వేసవిలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయని అంతా ఆశలు పెట్టుకుంటారు. కానీ కొన్నేళ్లుగా ఎక్కువగా చిన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత ఏడాది దసరా, విరూపాక్ష లాంటి మిడ్ రేంజ్ సినిమాలు విడుదలయ్యాయి. అప్పుడు విరూపాక్ష బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కోవిడ్ వైరస్ వల్ల రెండేళ్ల వేస్ట్ అయితే.. గత ఏడాది కూడా టాలీవుడ్ బడా హీరోల సినిమాలు రిలీజ్ అవ్వలేదు.

ఈ సంవత్సరం ఇంకా దారుణంగా మారింది పరిస్థితి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీతో సమ్మర్ సీజన్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది సహా అనేక మిడ్ రేంజ్, చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ వాటిలో చాలా తక్కువ మాత్రమే మంచి టాక్ సంపాదించుకున్నాయి.

కొన్ని సినిమాలకు వీకెండ్ అయ్యాక థియేటర్లకు మినిమమ్ ఆడియన్స్ కూడా రావడం లేదు. అనేక చోట్ల ఆక్యుపెన్సీ డబుల్ డిజిటల్ దాటక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఏకంగా చెప్పుకోదగ్గ రిలీజ్ లు లేక తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు 10 రోజుల పాటు మూతపడ్డాయి. అందుకు ముఖ్య కారణం పెద్ద మూవీలు వాయిదా పడటం. దేవర అక్టోబర్ కు పోస్ట్ పోన్ అవ్వగా.. కల్కి జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది.

అయితే మరికొద్ది రోజుల్లో కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. కానీ వాటిపై అంత హైప్ లేదు. దీంతో ఈ వేసవి గత ఏడాది కంటే వెలవెలబోయింది. 2024లో బడా హీరోల చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నా.. సమ్మర్ ను మాత్రం టాలీవుడ్ మేకర్స్ క్యాష్ చేసుకోలేకపోయారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సమ్మర్ ను క్యాష్ చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ మే31వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. ఆ మూవీతో పాటు హరోం హర, గం గం గణేశా కూడా అదే రోజు రిలీజ్ కానున్నాయి. కనీసం సమ్మర్ లాస్ట్ లోనైనా ఈ చిత్రాలు మెరుపులు మెరుస్తాయేమో చూడాలి.