Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ వద్ద మెగా దండయాత్ర

కల్కి స్ట్రాంగ్ గా మొదలు పెడితే ఈ ఏడాది బాక్సాఫీస్ కు మరీంత బూస్ట్ దక్కినట్లే. రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ సినిమాలు రానున్నాయి

By:  Tupaki Desk   |   18 Jun 2024 2:08 PM GMT
బాక్సాఫీస్ వద్ద మెగా దండయాత్ర
X

కల్కి స్ట్రాంగ్ గా మొదలు పెడితే ఈ ఏడాది బాక్సాఫీస్ కు మరీంత బూస్ట్ దక్కినట్లే. రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ సినిమాలు రానున్నాయి. ముఖ్యంగా 2024 చివరి భాగం తెలుగు సినీ అభిమానుల కోసం హైలైట్ గా నిలవబోతుంది. ఈ ఏడాది చివరలో అలాగే 2025 ప్రారంభంలో, మెగా హీరోల సినిమాల తాకిడి గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి మెగా హీరోలు తమ కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

ముందుగా రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' 2024 చివర్లో విడుదల కానుంది. ఈ సినిమా డిసెంబర్ లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు శంకర్ చాలా ఆలస్యం చేశాడు. ఇక దిల్ రాజు డిసెంబర్ ను ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఫిక్స్ అయ్యాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరి హర వీర మల్లు' కూడా 2024 చివరలోనే విడుదల కావాల్సి ఉంది.

అనుకున్నట్లు షూటింగ్ పూర్తయితే, నవంబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, పవన్ కళ్యాణ్ కొత్తగా ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, ఆయన తేదీలు సరిగ్గా సెట్ చేయడం ఓ సవాలుగా మారింది. మరోవైపు 2025 సంక్రాంతి సందర్భంగా చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా విడుదల కానుంది. ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇలా, 2024 చివర నుండి 2025 ప్రారంభం వరకు మెగా ఫ్యామిలీకి చెందిన పలు సినిమాలు విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వరుసలో 'పుష్ప 2' ని కూడా చేర్చితే, ఇది నాలుగో మెగా సినిమా అవుతుంది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా కూడా పెద్ద ఎత్తున విడుదల కావాల్సి ఉంది. మెగా హీరోల నుంచి పెద్ద సినిమాలు వచ్చి చాలా అవుతోంది. ఇక రాబోయే రోజుల్లో నాన్ స్టాప్ మెగా ఈవెంట్స్ ఉంటాయని చెప్పవచ్చు.

మెగా ఫ్యాన్స్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గెలుపును సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో విడుదలకానున్న వీరమల్లు సినిమా వారి ఆనందాన్ని మరింత పెంచబోతున్నాయి. అలాగే చరణ్, చిరంజీవి లాంటి మెగా హీరోల సినిమాలు కూడా రెడీ అవుతాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద వారి డామినేషన్ గట్టిగానే ఉండబోతోంది. ఇక ఇదే సమయంలో, మిగతా హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఎవరు కూడా మెగా క్లాష్ లో రిస్క్ చేయాలని అనుకోవడం లేదు.