Begin typing your search above and press return to search.

మూడు సినిమాలు… 325 కోట్ల ప్రాఫిట్

టాలీవుడ్ లో 2024 ప్రథమార్ధం లో 100కి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి

By:  Tupaki Desk   |   27 July 2024 3:25 PM GMT
మూడు సినిమాలు… 325 కోట్ల ప్రాఫిట్
X

టాలీవుడ్ లో 2024 ప్రథమార్ధం లో 100కి పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే వీటిలో సక్సెస్ అందుకున్నవి మాత్రం చాలా తక్కువ. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినవి అంటే కరెక్ట్ గా మూడు సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ ఈ ఏడాది ఆరంభంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన కూడా ఈ మూవీ భారీ లాభాలని ఆర్జించింది.

వరల్డ్ వైడ్ గా 300 కోట్ల కలెక్షన్స్ ని హనుమాన్ సినిమా సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన వసూళ్లని రాబట్టింది. దీని తర్వాత మరల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం అంటే టిల్లు స్క్వేర్ అని చెప్పాలి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. సిద్దు జొన్నలగడ్డ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని ఈ చిత్రం సాధించడం విశేషం.

ఈ చిత్రం తర్వాత డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ ఈ ఏడాది టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా చాలా రికార్డులని తిరగరాసింది. ఇండియన్ బాక్సాఫీస్ నుంచి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి రికార్డ్ సృష్టించింది. అలాగే ప్రభాస్ కెరియర్ లోనే 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిందిన రెండో సినిమాగా నిలిచింది. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ లో 1000 కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా మారింది.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాది మూడు సినిమాలు కలిపి 345 కోట్ల ప్రాఫిట్ ని తెలుగు పరిశ్రమకి అందించాయి. కల్కి 2898ఏడీ మూవీ 155 కోట్ల ప్రాఫిట్ ని సాధించింది. అలాగే హనుమాన్ సినిమా 128 కోట్ల లాభాలని ఆర్జించింది. టిల్లు స్క్వేర్ మూవీ 42 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది. హనుమాన్ తర్వాత సరైన సక్సెస్ లేకపోవడంతో థియేటర్స్ యజమానులు తీవ్రమైన నష్టాలు చవి చూసారు. ఆ తరువాత టిల్లు స్క్వేర్ మూవీ వచ్చి వారికి కొంత ఊరటనిచ్చింది.

మరల మరో సక్సెస్ రావడానికి చాలా కాలం పట్టింది. ఈ సమయంలో థియేటర్స్ ని మూసేయడానికి కూడా యజమానులు సిద్ధం అయ్యారు. ఇలాంటి సమయంలో కల్కి 2898ఏడీ మూవీ వారందరూ నష్టాల నుంచి కోలుకునేలా చేసింది. అయితే ప్రతి నెల, ఒకటి, రెండు సినిమాలు సక్సెస్ పడితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు ఎలాంటి టెన్షన్ లేకుండా ధైర్యంగా బ్రతికే భరోసా దొరుకుతుందనే మాట వినిపిస్తోంది.