టాలీవుడ్ పాన్ ఇండియా.. నెక్స్ట్ దర్శకధీరులు వీరే..?
అతని సినిమాల కోసం ఆడియన్స్ క్యూరియాసిటీతో వెయిట్ చేసేలా చేసుకుంటున్నాడు.
By: Tupaki Desk | 7 March 2024 4:55 AM GMTటాలీవుడ్ నుంచి ఇప్పటికే రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. అతని నుంచి సినిమా వస్తుంది అంటేనే వెయ్యి కోట్ల కలెక్షన్స్ లెక్కలు వేసుకోవచ్చు. ఆ స్థాయి స్టామినా ఇండియాలో ఇంకా ఏ దర్శకుడికి లేదని చెప్పాలి. రాజమౌళి స్థాయిలో కాకపోయిన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలతో సక్సెస్ అయిన దర్శకులు అంటే సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, చందూ మొండేటి, ప్రశాంత్ వర్మ కనిపిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా కూడా ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ గా ఉన్నాడు. అతని సినిమాల కోసం ఆడియన్స్ క్యూరియాసిటీతో వెయిట్ చేసేలా చేసుకుంటున్నాడు. ఇక సుకుమార్ ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా ఉన్నాడు. పుష్ప ది రూల్ మూవీతో అతని ఇమేజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్తుందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ అయ్యే సత్తా కొంతమందికే ఉందనే మాట వినిపిస్తోంది.
పెర్ఫెక్ట్ స్టోరీస్, అదిరిపోయే ఐడియాలతో మూవీస్ చేస్తోన్న దర్శకుల జాబితాలో ఐదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు. హనుమాన్ సినిమాతో దేశ వ్యాప్తంగా వైబ్ క్రియేట్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్ లోనే పర్ఫెక్ట్ కాన్సెప్ట్, క్వాలిటీ గ్రాఫిక్స్, విజువలైజేషన్ తో హనుమాన్ మూవీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. నెక్స్ట్ దశాబ్దానికి సరిపడా కథలని ఇప్పటికే ప్రశాంత్ వర్మ రెడీ చేసుకున్నాడు. సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి సూపర్ హీరో కథలని ఇండియన్ ఆడియన్స్ కి చూపించబోతున్నాడు.
నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీతో వండర్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం పాన్ వరల్డ్ లెవల్ లో అతని పేరు వినిపించడం గ్యారెంటీ. ఇక సుజిత్ సాహో మూవీతో పాన్ ఇండియా సినిమా చేశాడు. హిందీలో మూవీ సక్సెస్ అయ్యింది. ఓజీతో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.
చందూ మొండేటి ఇప్పటికే కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్ లో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తండేల్ తో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇది వర్క్ అవుట్ అయితే పాన్ ఇండియా డైరెక్టర్స్ జాబితాలో ఇతను చేరిపోతాడు. ఉప్పెనతో పరిచయం అయిన బుచ్చిబాబు సానా ఇంకా తనలోని పూర్తిస్థాయి టాలెంట్ ని బయటపెట్టే ఛాన్స్ రాలేదు. రామ్ చరణ్ తో చేయబోయే పాన్ ఇండియా మూవీ అతని సామర్ధ్యాన్ని పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. ఈ ఐదుగురు డైరెక్టర్స్ టాలీవుడ్ నుంచి నెక్స్ట్ పాన్ ఇండియా దర్శకులుగా సత్తా చాటబోతున్నారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.