Begin typing your search above and press return to search.

3 పాన్ ఇండియా సినిమాలు.. ఇది మ్యాటర్!

ఓ వైపు రాబోయే ఆరు నెలల కాలంలో టాలీవుడ్ నుంచి అరడజను పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి

By:  Tupaki Desk   |   2 July 2024 4:16 AM GMT
3 పాన్ ఇండియా సినిమాలు.. ఇది మ్యాటర్!
X

ఓ వైపు రాబోయే ఆరు నెలల కాలంలో టాలీవుడ్ నుంచి అరడజను పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అన్ని కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్యనే థియేటర్స్ లోకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. మంచి కథాబలం ఉన్న మూవీస్ గా ఈ పాన్ ఇండియా సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దాంతో పాటు టైర్ 2 హీరోల నుంచి కొన్ని సినిమాలు ఈ ఆరు నెలల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.

రిలీజ్ సంగతి ఇలా ఉంటే స్టార్ హీరోలు తాము కమిట్ అయిన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు. ప్రెస్టీజియస్ కాంబినేషన్స్ లో ఈ మూవీస్ తెరకెక్కబోతూ ఉండటం విశేషం. దీంతో వీటిపైనా ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా చాలా గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ హీరోగా తన సెకండ్ మూవీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.

జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం అవ్వబోతోందని తెలుస్తోంది. గేమ్ చేంజర్ పెండింగ్ షూటింగ్ ఈ నెలలో కంప్లీట్ చేసుకొని మేకోవర్ పై రామ్ చరణ్ ఫోకస్ చేయనున్నాడంట. నెల రోజులపాటు RC16 మూవీలో క్యారెక్టర్ లుక్ పైన దృష్టిపెట్టి తరువాత షూటింగ్ లో జాయిన్ కానున్నాడంట.

ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరో వైపు వార్ 2 షూటింగ్ కూడా జరుగుతోంది. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా సెప్టెంబర్ లోనే మొదలు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రష్మిక మందన ఈ చిత్రంలో తారక్ కి జోడీగా కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో సలార్ 2 మూవీ చేయాల్సి ఉంది. అలాగే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ షూటింగ్ స్టేజ్ లో ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇవన్నీ ఇలా ఉండగానే హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో స్టార్ట్ కాబోతోందని టాక్. ప్రస్తుతం క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో డైరెక్టర్ హను ఉన్నారంట. ఈ మూవీకి సంబందించిన సెట్స్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యిందంట.