టాలీవుడ్ టాప్ 10.. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇవే తోపు!
ఇక ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ 10 తెలుగు సినిమాల వివరాల్లోకి వెళితే..
By: Tupaki Desk | 15 July 2023 1:10 PM GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వారి మార్కెట్ పరిధిని ప్రతి సినిమాతో ఎంతో కొంత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుల కాంబినేషన్ సెట్ అయితే మాత్రం వాటి వాల్యూ అనంతంగా కరిగిపోతోంది. అయితే బిగ్ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ స్థాయిలో టాలీవుడ్ స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ 10 తెలుగు సినిమాల వివరాల్లోకి వెళితే..
ముందుగా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR అత్యధిక స్థాయిలో విడుదలకు ముందే మంచి డిమాండ్ ఏర్పరచుకుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు నటించడం వలన సినిమా ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.
ఇక బాహుబలి సెకండ్ పార్ట్ తోనే రాజమౌళి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ప్రభాస్ కెరియర్ లోనే అత్యధిక స్థాయిలో ఈ సినిమాకు ఫుల్ డిమాండ్ అయితే పెంచుకున్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 352 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో చేసిన సాహో సినిమా కూడా టీజర్ పోస్టర్స్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు 270 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టాక్ ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టబడిన అయితే వెనక్కి తీసుకువచ్చింది.
ఇక ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమాతో మరోసారి ప్రభాస్ మరో రికార్డ్ అందుకున్నాడు. అతని కెరీర్ లో సాహో బాహుబలి తర్వాత అత్యధిక స్థాయిలో ఆదిపురుష సినిమా 240 కోట్లతో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ పాన్ ఇండియా మార్కెట్ లో 202 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి కూడా అప్పట్లో భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా 187.25 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది.
ఇక అల్లు అర్జున్ పుష్ప 1 సినిమా ఊహించిన విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద 144 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అప్పట్లో అల్లు అర్జున్ స్థాయిని పెంచింది. ఇక ఆచార్య సినిమా 131 కోట్లు, మహేష్ బాబు స్పైడర్ 124.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. ఇక టాప్ టెన్ లిస్టులో ప్రస్తుతం అజ్ఞాతవాసి 123 కోట్లతో పదవ స్థానంలో కొనసాగుతోంది.