గద్దర్ అవార్డులపై నిర్మాతల మండలి-వాణిజ్య మండలి!
`గద్దర్` అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి నిన్నిటి రోజున ఓ పాత ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 July 2024 11:39 AM GMT`గద్దర్` అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి నిన్నిటి రోజున ఓ పాత ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి- తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధికారికంగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి - గౌరవ సినిమాటోగ్రాఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న కృషికి ధన్యవాధాలు తెలియజేసారు.
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబందించిన సంస్థల ప్రతినిధులకు తమ విలువైన సమయం ఇచ్చి పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ నూతన ప్రభుత్వం తెలంగాణాలో అన్నిరకాల అభివృద్ధికి కృష్హి జేస్తారని తెలియజేసారు.
ఈ సందర్భంలోనే సినిమా పరిశ్రమకు చెందిన వారికి `గద్దర్ అవార్డులు` ప్రదానం చేస్తామని దానికి సంబంధించిన విధి విధానాలు తయారు చేయాలని కోరారు. ఈ విషయంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి- తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి `గద్దర్` అవార్డ్స్ గైడ్ లైన్స్ ను తెలంగాణ ఎఫ్ డీసీ కి తెలియజేసాం. త్వరలో `గద్దర్ అవార్డుల కొరకు మార్గ దర్శకాలు తెలంగాణ ఎఫ్ డీసీ వారి సంప్రదింపు లతో తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి - గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రికి సమర్పిస్తాం. గద్దర్ ని చూసి మేము గర్విస్తున్నాము.
నటుడిగా, కళాకారుడిగా, జానపద పాటలందు , పేదలకు చేసిన సేవలకు సేవా రంగంలో ఆయన చేసిన విలువైన కృషికి మాకు చాలా గౌరవం ఉంది అని నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టిప్రస్న్న కుమార్ పేర్కొన్నారు. నిర్మాతల మండలి-వాణిజ్య మండలి తరుపున ఓ కమిటి వేసి విధి విధానాలు రూపొందించి ఎఫ్ డీసీ ద్వారా సీఎంకి తమ ప్రతిపాదన పంపిస్తామని ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, కార్యదర్శులు కె.ఎల్ దామోదర్ ప్రసాద్, కె. శివప్రసాద్ రావు ప్రకటనలో పేర్కొన్నారు.