సినిమాలతో కాదు రిలీజ్ కోట్లాట ఎక్కువైంది..!
కానీ సినిమా ఆ డేట్ న రావడం కష్టమని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ సైడ్ ఇవ్వడం దాదాపు కన్ ఫర్మ్ కాబట్టే ఫ్యామిలీ స్టార్ ని ఆ రోజున రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.
By: Tupaki Desk | 30 Jan 2024 3:43 PM GMTసంక్రాంతి సినిమాల ఫైట్ సామరస్యపూర్వకంగానే ముగిసింది కదా అనుకుంటున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి అసలు కథ ముందుంది అనిపిస్తుంది. ఏప్రిల్ 5 నుంచి ఆగష్టు 15 వరకు టాలీవుడ్ సినిమాల రిలీజ్ ల కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. ముందుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా అనుకున్న డేట్ కు తీసుకు రావాలని ప్లాన్ చేశారు. కానీ సినిమా ఆ డేట్ న రావడం కష్టమని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ సైడ్ ఇవ్వడం దాదాపు కన్ ఫర్మ్ కాబట్టే ఫ్యామిలీ స్టార్ ని ఆ రోజున రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.
ఇక మరోపక్క మే 9న కల్కి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. వైజయంతి బ్యానర్ ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న సినిమా అది. నాగ్ అశ్విన్ ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తీస్తున్నాడని తెలుస్తుంది. మే 9కి తెచ్చే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నా ఆ రోజు మిస్సైతే కల్కి రిలీజ్ ఎప్పుడన్నది చెప్పడం కష్టం.
జూన్, జూలై స్టార్ సినిమాల సందడి అంతగా ఉండదు. ఆ రెండు నెలలు చిన్న సినిమాలు పండుగ చేసుకోవచ్చు. ఇక ఆగష్టులో అసలు సమరం ఉంటుంది. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ లాక్ చేశారు. రిలీజ్ ఇంకా 200 డేస్ అంటూ పుష్ప యూనిట్ ప్రకటించింది. పుష్ప 2 రావడం ఆగితే నాని సరిపోదా శనివారం వచ్చేందుకు రెడీ అయ్యాడు.
దేవర ఏప్రిల్ 5న మిస్సైతే ఆగష్టు 15న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. పుష్ప 2 ఆగష్టు 15న వస్తే దేవర రావడం కష్టమే. సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పుడే రిలీజ్ డేట్ లు ప్రకటించి తీరా ఆ టైం వచ్చేసరికి వాయిదా వేస్తున్నారు. ఆల్రెడీ ఆ డేట్ న రిలీజ్ అనుకున్న సినిమాలు మళ్లీ పెద్దల దగ్గర పంచాయితీకి దిగుతున్నారు. ప్రస్తుతం స్టార్స్ అంతా కూడా సినిమాలతో కాదు రిలీజ్ డేట్స్ తో కొట్లాట మొదలు పెట్టారని చెప్పొచ్చు.
దేవర, పుష్ప 2 తోనే ఈ ఫైట్ ముగిసేలా లేదు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో వస్తున్న సినిమాల మధ్య కూడా ఇదే రేంజ్ ఫైట్ జరిగేలా ఉంది. పండుగ సీజన్ అయితే స్టార్స్ మధ్య పోటీ ఓకే కానీ ఒకటి రెండు రోజుల హాలీడే ఉంటే ఒకే రోజు స్టార్ సినిమాలు వస్తే మాత్రం ఆ సినిమాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.