Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ హీరోల‌కు ఆడియ‌న్స్ వార్నింగ్ బెల్స్!

నేటి జ‌న‌రేష‌న్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సునాయాసంగా వంద‌ల కోట్ల వ‌సూళ్లను సాధిస్తున్నాయి

By:  Tupaki Desk   |   21 July 2024 5:30 PM GMT
సీనియ‌ర్ హీరోల‌కు ఆడియ‌న్స్ వార్నింగ్ బెల్స్!
X

మార్కెట్ లో కటౌట్ కంటే కంటెంట్ కే ప్రేక్ష‌కులు పెద్ద పీట వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌ర భాష‌ల సినిమాలు సైతం భారీ విజ‌యం సాధిస్తున్నాయంటే? తెలుగు ఆడియన్స్ కంటెంట్ కి ఎంత ప్రాధాన్య‌త ఇస్తున్నార‌న్న‌ది అద్దం ప‌డుతుంది. ఇప్ప‌టికే ఓ జ‌న‌రేష‌న్ హీరోలంతా మారి ప్రేక్ష‌కుల ప‌ల్స్ ప‌ట్టుకుని సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. నేటి జ‌న‌రేష‌న్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సునాయాసంగా వంద‌ల కోట్ల వ‌సూళ్లను సాధిస్తున్నాయి.

క‌నీసం ఆ హీరో పేరు కూడా తెలియ‌కుండానే ఆడియ‌న్స్ థియేట‌ర్ కి వెళ్లి సినిమా చూస్తున్నారు. కార‌ణంగా మౌత్ టాక్ తో వ‌చ్చిన పాజిటివ్ టాక్ తోనే ఇది సాధ్య‌మ‌వుతుంది. ఈ సినారేలో హీరో స్టార్ డ‌మ్ అనేది కేవ‌లం కొంత‌వ‌ర‌కూ ప‌రిమిత‌మ‌వుతుంది. రాను రాను అది మ‌రింత బ‌ల‌హీనంగా మారుతుంది అన‌డానికి ఈ సీనియ‌ర్ హీరోల్ని ఉద‌హ‌రించొచ్చు. `ఆచార్య‌, `భోళా శంక‌ర్` సినిమాల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారో తెలిసిందే.

అంత వ‌ర‌కూ ఏనాడు ట్రోలింగ్ గురికాని మెగాస్టార్ సైతం తొలిసారి ట్రోలింగ్ బారిన ప‌డాల్సి వ‌చ్చింది. అలాగే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ `జైల‌ర్` తో ఓ ఊపు ఊసేసినా ఆ ఇమేజ్ `లాల్ స‌లామ్` విష‌యంలో ఎక్కడా ప‌నిచేయ‌లేదు. క‌నీసం ఓపెనింగ్ కూడా తేలేక‌పోయిందా చిత్రం. కంటెంట్ లేని సినిమా అని తేలిపోవ‌డంతోనే ర‌జ‌నీ ఇమేజ్ అక్క‌డ ప‌నిచేయ‌లేదు. ఇక ఇటీవ‌ల భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన `భార‌తీయుడు-2` ఎలాంటి టాక్ సొంతం చేసుకుంద‌న్న‌ది తెలిసిందే.

వ‌సూళ్ల విష‌యంలో కోలీవుడ్ కంటే టాలీవుడ్ బెట‌ర్ గా అనిపించింది. అంటే క‌మ‌ల్ హాస‌న్- శంక‌ర్ సినిమ‌కి సొంత భాష అభిమానులే క‌నెక్ట్ కాలేదు అన్న‌ది అర్ద‌మ‌వుతుంది. ఇవ‌న్నీ సీనియ‌ర్ హీరోలకు ప్రేక్ష‌కులు ఇచ్చిన వార్నింగ్ బెల్స్ లాంటివి. త‌దుప‌రి చిత్రాల్లో వీళ్లంతా కంటెంట్ కింగ్ లా ఉండే సినిమాలు చేస్తార‌ని ప్రేక్ష‌కులు ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ సీనియ‌ర్ హీరోల‌తో ప‌నిచేస్తోన్న ద‌ర్శ‌కుల‌పై ఈ ఒత్తిడి త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం చిరంజీవి `విశ్వంభ‌ర‌`, ర‌జ‌నీకాంత్ `వెట్టేయాన్`, క‌మ‌ల్ హాస‌న్ `థ‌గ్ లైప్` ..`ఇండియ‌న్-3` పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌తో పాటు, ద‌ర్శ‌క, హీరోల‌పై ఒత్తిడి పీక్స్ లోనే ఉంది సుమీ.