Begin typing your search above and press return to search.

మన హీరోల బిజినెస్.. ఎవరు ఏ రేంజ్ లో ఉన్నారంటే..

మన టాలీవుడ్ హీరోలలో ఇప్పటికే కొంతమంది వరల్డ్ వైడ్ గా తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   17 Aug 2024 8:41 AM GMT
మన హీరోల బిజినెస్.. ఎవరు ఏ రేంజ్ లో ఉన్నారంటే..
X

ఇండియన్ బాక్సాఫీస్ నుంచి అత్యధిక పాన్ ఇండియా సినిమాలు అందిస్తోన్న పరిశ్రమ టాలీవుడ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టైర్ 2, టైర్ 1 హీరోలు అందరూ ఆల్ మోస్ట్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మన టాలీవుడ్ హీరోలలో ఇప్పటికే కొంతమంది వరల్డ్ వైడ్ గా తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. పలనా హీరోతో మూవీ చేస్తే కచ్చితంగా ఇన్ని కోట్ల బిజినెస్ అవుతుందనే లెక్కలు దర్శక, నిర్మాతల దగ్గర ఉన్నాయనే మాట వినిపిస్తోంది. దీంతో ఆయా హీరోలతో మూవీస్ అంటే బడ్జెట్ లు కూడా కేలిక్యులేషన్ వేసుకొని నిర్మాతలు పెట్టుబడు పెడుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి టైర్ 2 హీరోల వరకు ఎవరికి ఎంత మార్కెట్ ఉందనేది సరాసరి లెక్కలు చూసుకుంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాప్ లో ఉన్నారు. వరుసగా సలార్, కల్కి 2898ఏడీ సినిమాల సక్సెస్ తర్వాత ఆయన సినిమాల బిజినెస్ వేల్యూ 600 కోట్లకి చేరినట్లు తెలుస్తోంది. సలార్ యావరేజ్ టాక్ తెచ్చుకొని కూడా 700 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సరైన కంటెంట్ పడితే మాత్రం 1000 కోట్లు కలెక్షన్స్ ప్రభాస్ తో అందుకోవడం పెద్ద కష్టం కాదని కల్కి మూవీ ప్రూవ్ చేసింది. దీంతో నిర్మాతలు అతని సినిమాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

వీరి తర్వాత స్థానంలో పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ కి మార్కెట్ లో 400 కోట్ల వరకు బిజినెస్ వేల్యూ ఉంది. పుష్ప మూవీ హిట్ కావడంతో పుష్ప 2పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 400 కోట్లకి పైగా వరల్డ్ వైడ్ గా బిజినెస్ చేసిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ సోలోగా తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

అయితే ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ పై 400 కోట్ల బిజినెస్ జరుగుతోంది. అలాగే రామ్ చరణ్ పైన కూడా 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. ఇప్పుడు వీరిద్దరి నుంచి వస్తోన్న దేవర, గేమ్ చేంజర్ సినిమాలు సక్సెస్ అయితే బిజినెస్ రేంజ్ పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు భాషకి మాత్రమే పరిమితం అయిన మహేష్ బాబుకి గ్లోబల్ వైజ్ గా మంచి మార్కెట్ ఉంచి. ఒక్క తెలుగులోనే అతని సినిమాలపై 200 కోట్ల బిజినెస్ జరుగుతోంది. రాజమౌళి తరువాత ఆ లెక్క వేరేలా ఉండవచ్చు కానీ ప్రస్తుతం అయితే ఆ నెంబర్ దగ్గరే ఉంది.

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా చక్రం తిప్పారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో వీరిద్దరూ వెనుకపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా కథలు టచ్ చేయలేదు. గత 10 ఏళ్ళ కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు కూడా చాలా తక్కువ. అలాగే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఎక్కువగా కమర్షియల్ ఫార్మాట్ కథలే ట్రై చేశారు. సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ చేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే వీరిద్దరి బిజినెస్ మార్కెట్ 150 కోట్ల దగ్గరనే ఇంకా ఉంది.

వీరి తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలపై 80 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. సరైన కంటెంట్ పడితే 100 కోట్ల వరకు విజయ్ దేవరకొండ సినిమాలపై బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నాచురల్ స్టార్ నాని నిలకడగా తన మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. దసరా, హాయ్ నాన్న సినిమాల తర్వాత నాని రేంజ్ పెరిగింది. ప్రస్తుతం అతనికి 60 కోట్ల వరకు మార్కెట్ ఉంది. బలమైన కథ పడితే ఇంకా నాని సినిమాపై ఇంకా ఎక్కువ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. నందమూరి బాలకృష్ణకి అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత మార్కెట్ పెరిగింది. ఆయనపై 60 కోట్ల వరకు బిజినెస్ ప్రస్తుతం నడుస్తోంది.

రామ్ పోతినేనికి కూడా తన మార్కెట్ పెంచుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ 40 కోట్ల వరకు ఆయన ఆయనపై బిజినెస్ జరిగింది. కార్తికేయ2తో పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అందుకున్న నిఖిల్ కి కూడా 30-40 కోట్ల మధ్యలో బిజినెస్ ఉందనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ ఆయన నుంచి రాబోయే సినిమాలు కచ్చితమైన లెక్కని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. మాస్ మహారాజ్ రవితేజపై సినిమాల హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా 30 కోట్ల వరకు బిజినెస్ నడుస్తోంది.

ఆయనతో సినిమా అంటే కచ్చితంగా 30 కోట్ల వరకు బిజినెస్ ఈజీగా అయిపోతుందనే ధీమా నిర్మాతల్లో ఉంది. అలాగే నాగ చైతన్య పైన కూడా 30 కోట్ల బిజినెస్ నడుస్తోంది. 75కోట్ల బడ్జెట్ తో వస్తున్న తండేల్ మూవీ పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అయితే అతని బిజినెస్ వేల్యూ పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నెక్స్ట్ కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సినిమాలపై 20 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది. అలాగే యంగ్ హీరోలైన అఖిల్ అక్కినేని, సిద్దు జొన్నలగడ్డ, రానాదగ్గుబాటి, సాయి ధరమ్ తేజ్, నితిన్, విశ్వక్ సేన్, శర్వానంద్, అడవి శేష్ లకి కూడా 20 కోట్ల బిజినెస్ ఉంది. దేశంలోనే హైయెస్ట్ బిజినెస్ వేల్యూ ఉన్న నలుగురు స్టార్ హీరోలు తెలుగులోనే ఉన్నారని ఈ లెక్కల బట్టి చెప్పొచ్చు. హీరో రేంజ్ బట్టి, మార్కెట్ లో వారికున్న స్టాండర్డ్స్ బట్టి సినిమాలపై భారీగా పెట్టుబడులు పెట్టడానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారనే మాట వినిపిస్తోంది.