ప్రతీ నెలలో మన స్టార్ హీరోల సునామీలు!
అయితే ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రం టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద సినిమాలు గట్టిగా బ్లాస్ట్ కాబోతున్నాయి
By: Tupaki Desk | 29 March 2024 4:50 AM GMT2024 ఆరంభం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి అంతగా కలిసిరాలేదని చెప్పాలి. ఈ మూడు నెలల్లో 66 తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే వాటిలో చెప్పుకోదగ్గ స్థాయిలో పెర్ఫార్మ్ చేసిన సినిమాలు సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయని చెప్పాలి. పాన్ ఇండియా లెవల్ లో హై ఇంపాక్ట్ చూపించిన సినిమా హనుమాన్ మాత్రమే. మిగిలిన సినిమాలు అన్ని ఏదో మోస్తరుగా ప్రభావం చూపించాయి.
అయితే ఈ ఏడాది ద్వితీయార్ధంలో మాత్రం టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద సినిమాలు గట్టిగా బ్లాస్ట్ కాబోతున్నాయి. ప్రతి నెల ఒక స్టార్ హీరో మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. అలాగే ఈ సినిమాలపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ లైన్ అప్ ఓ సారి చూసుకుంటే మొదటిగా డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ రిలీజ్ కానుంది.
జూన్ లేదా జులై నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. కనీసం 350 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ థియేటర్స్ లోకి రానున్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం 1000 కోట్లు కలెక్షన్స్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ ఆగష్టులో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 15 అని డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఇక ఆ నెలలో ఈ సినిమా హడావుడి ఎక్కువగా హైలెట్ కానుంది.
పుష్ప 2 కూడా 300 కోట్లకి పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తోనే ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది. దేశ వ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అల్లు అర్జున్ ఖాతాలో 1000 కోట్ల కలెక్షన్స్ ప్రాజెక్ట్ గా పుష్ప ది రూల్ చేరిపోనుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ OG సెప్టెంబర్ లో సౌండ్ పెంచనుంది. సెప్టెంబర్ 27 న రానున్న ఈ సినిమా విడుదలకు ముందు అప్డేట్స్ తోనే హైప్ మరింత పెంచే అవకాశం ఉంది.
మరోవైపు అక్టోబర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 10. ఆ నెల మొత్తం కూడా ఎన్టీఆర్ సునామీ బాక్సాఫీస్ పై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేవర సినిమాతో తారక్ ఇమేజ్ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. హిందీలో కూడా దేవర ఇంపాక్ట్ బలంగా ఉటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వొచ్చని అంచనా చేస్తున్నారు. ఇంకా అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ కాలేదు కానీ ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు చేతిలో ఉన్న ఒకే ఒక్క అప్షన్ అది. లేదంటే మళ్ళీ 2025 సమ్మర్ వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడాలి మరి శంకర్ సార్ సినిమాను ఎంత త్వరగా ఫినిష్ చేశారు.