Begin typing your search above and press return to search.

ప్రభాస్ Vs ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్!

అయితే వీరిలో నిజమైన పాన్ ఇండియా స్టార్ ఎవరనే విషయం మీద సోషల్ మీడియాలో తరచుగా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   30 July 2024 4:23 PM GMT
ప్రభాస్ Vs ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్!
X

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకొని, మార్కెట్ విస్తరించుకోడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు పాన్ ఇండియన్ స్టార్ డమ్ అందుకున్నారు. అయితే వీరిలో నిజమైన పాన్ ఇండియా స్టార్ ఎవరనే విషయం మీద సోషల్ మీడియాలో తరచుగా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి.

మిగతా హీరోలంతా డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి అండతో స్టార్ డమ్ సాధించారని, ఆయన సపోర్ట్ లేకుండానే 'పుష్ప'తో సత్తా చాటిన బన్నీనే ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ అని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుంటారు. RRR సినిమాతో గ్లోబల్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమకు వందేళ్ల నాటి ఆస్కార్ అవార్డ్ కలను సాకారం చేసిన పెట్టిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అసలైన పాన్ ఇండియా స్టార్స్ అని వాళ్ళ అభిమానులు అంటుంటారు.

'బాహుబలి' చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్ళి, పాన్ ఇండియాకి బాటలు వేసిందే ప్రభాస్ అని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతుంటారు. 'బాహుబలి 2' తో ఆయన క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పటికీ ఎవరూ అందుకోలేకపోతున్నారని, 'కల్కి' మూవీతో రాజమౌళి మద్దతు లేకుండానే ₹1000 కోట్లు కొట్టి చూపించాడని కామెంట్లు చేస్తుంటారు. అంతేకాదు ప్రభాస్ ఒక్కడే తన క్రేజ్ ను కాపాడుకునేలా సినిమాలు చేస్తున్నారని, బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ తో ఇండస్ట్రీని కాపాడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి ప్రభాస్ నుంచి గత రెండేళ్లలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిల్లో 'సలార్ 1', 'కల్కి 2898 AD' సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయితే, 'రాధే శ్యామ్‌' 'ఆదిపురుష్' చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో 'పుష్ప: ది రైజ్' తర్వాత అల్లు అర్జున్ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ ఏడాది డిసెంబర్ లో 'పుష్ప: ది రూల్' రిలీజ్ అవుతుంది. అంటే బన్నీ నుంచి దాదాపు మూడేళ్ళకు ఇంకో సినిమా వచ్చినట్లు అవుతుంది.

అలానే RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి మరో మూవీ రాలేదు. రామ్ చరణ్ మాత్రం 'ఆచార్య' వంటి మల్టీస్టారర్ లో నటించారు కానీ, సోలోగా ఒక్క మూవీ కూడా రిలీజ్ చెయ్యలేదు. ఈ విధంగా వర్క్ విషయంలో కంపేర్ చేసి చూస్తే, ప్రభాస్ మిగతా హీరోల కంటే ముందున్నారని చెప్పాలి. పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసుకొని సినిమాలు పూర్తి చేస్తున్నారు.. అనుకున్న సమయానికి వాటిని విడుదల చేస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నారు.

రిజల్ట్ ఎలా ఉందనేది పక్కన పెడితే, పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల రెవెన్యూ జెనరేట్ అవుతుంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి థియేటర్ క్యాంటీన్ల వరకూ అందరూ లాభ పడతారు. అదే జరిగితే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఇటీవల 'కల్కి' సినిమా వల్ల కరెంట్ బిల్లులు కట్టుకోలేని స్థితికి వెళ్లిపోయిన ఎన్నో థియేటర్లను రీ ఓపెన్ చేశారు. మంచి విజయం సాధించడంతో సినిమాతో సంబంధం ఉన్న పార్టీలన్నీ లాభ పడ్డాయి. కాబట్టి వరుసగా నాలుగు సినిమాలను విడుదల చేసిన ప్రభాసే ఇప్పటికి నిజమైన 'పాన్ ఇండియా స్టార్' అనుకోవచ్చు.