Begin typing your search above and press return to search.

ఆరంభంలోనే హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ స్టార్స్ వీరే..

అయితే కొంతమంది హీరోలు కెరియర్ ఆరంభంలో వరుస సక్సెస్ లు అందుకొని తరువాత వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   30 May 2024 4:57 AM GMT
ఆరంభంలోనే హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ స్టార్స్ వీరే..
X

టాలీవుడ్ లో ఎంతో మంది నటులు హీరోలుగా పరిచయం అయ్యారు. వారిలో కొంతమంది మాత్రమే స్టార్స్ గా ఎదిగారు. అయితే కొంతమంది హీరోలు కెరియర్ ఆరంభంలో వరుస సక్సెస్ లు అందుకొని తరువాత వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే హీరోగా కెరియర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నటీనటులు చూసుకుంటే ముందుగా ఉదయ్ కిరణ్ కనిపిస్తాడు.

అతను చిత్రం మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తరువాత నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలు కూడా ఉదయ్ కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా చేరాయి. ఈ మూడు సినిమాలు అతన్ని స్టార్ ని చేశాయి. నాలుగో మూవీగా చేసిన కలుసుకోవాలని ఏవరేజ్ అయ్యింది. అయితే తరువాత ఆశించిన స్థాయిలో ఉదయ్ కిరణ్ కి సక్సెస్ లు రాలేదు. ఉదయ్ కిరణ్ కెరియర్ ఎలా నడిచింది. ఎలా మరణించాడు అనేది అందరికి తెలిసిందే.

నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. గంగోత్రి మూవీతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ తరువాత ఆర్య, బన్నీ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకున్నాడు. ఈ మూడు సినిమాలు అతని ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి. తరువాత అతని నుంచి వచ్చిన హ్యాపీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. మళ్ళీ వెంటనే దేశముదురు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.

చాలా కాలం తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లు సొంతం చేసుకున్నాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ దక్కించుకున్నాడు. అతని కెరియర్ లో కూడా నాలుగో మూవీ ఏవరేజ్ గానే నిలవడం విశేషం. ఈ ముగ్గురు స్టార్స్ కూడా వరుసగా నాలుగు విజయాలు కెరియర్ ఆరంభంలో సొంతం చేసుకోలేకపోయారు.

ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా వీరి జాబితాలో చేరాడు. నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. నెక్స్ట్ జాతిరత్నాలు సినిమాతో సెకండ్ సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్ గా అనుష్కతో కలిసి చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సూపర్ హిట్ అయ్యింది. దీంతో హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్న నాలుగో హీరోగా నవీన్ నిలిచాడు. ఇతను 4వ మూవీ ఏంటనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. నవీన్ నాలుగో చిత్రంతో హిట్ కొడితే మిగిలిన హీరోలు సాధించలేని ఫీట్ ని టాలీవుడ్ లో అందుకున్నవాడు అవుతాడు.