Begin typing your search above and press return to search.

పవర్‌ ఫుల్ యాక్టర్స్‌ లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్స్

ఈ పవర్ లిస్టులో ఆరుగురు తెలుగు హీరోలు చోటు దక్కించుకోవడం విశేషం.

By:  Tupaki Desk   |   12 July 2024 11:57 AM GMT
పవర్‌ ఫుల్ యాక్టర్స్‌ లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్స్
X

ప్రముఖ ఆంగ్ల సినీ మ్యాగజైన్‌ ఫిల్మ్ కంపానియన్, ఓర్‌మ్యాక్స్‌ మీడియా సంస్థలు ప్రతీ ఏడాది ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పవర్ ఫుల్ యాక్టర్స్ లిస్టును ప్రకటిస్తూ ఉంటాయి. ఎప్పటిలాగే ఈ సంవత్సరానికి గాను పవర్ లిస్ట్‌ను రూపొందించారు. 2021 జనవరి నుంచి 2023 డిసెంబర్ మధ్య కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో ముందంజలో ఉన్న నటులు వేరే అంటూ జాబితాను విడుదల చేసారు. ఎవరికీ ర్యాంకులు ఇవ్వకుండా ఆల్ఫాబిటికల్ ఆర్డర్ లో పేర్లను ప్రచురించారు. ఈ పవర్ లిస్టులో ఆరుగురు తెలుగు హీరోలు చోటు దక్కించుకోవడం విశేషం.

FC-Ormax 2024 పవర్‌ ఫుల్‌ యాక్టర్స్‌ జాబితాలో టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్‌, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌, గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ లు ఉన్నారు. అలానే కోలీవుడ్ నుంచి రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, విజయ్, అజిత్‌ కుమార్‌, సూర్య వంటి ఐదుగురు తమిళ యాక్టర్స్ ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. మలయాళ నటులు మమ్ముటి, మోహన్‌ లాల్‌.. కన్నడ హీరో యష్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

సౌత్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం ఈ పవర్‌ ఫుల్ యాక్టర్స్ లిస్టులో ఉంది. షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, రణ్‌ బీర్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, అలియా భట్‌, కత్రినా కైఫ్‌ వంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటుగా.. దిలీప్‌ జోషి, రుపాలీ గంగూలీ వంటి హిందీ సీరియల్ నటీనటులకు కూడా 'ఫిల్మ్ కంపానియన్ - ఓర్‌మ్యాక్స్‌ 2024' పవర్ యాక్టర్స్ లిస్టులో చోటు దక్కింది.

ఇక టెక్నీషియన్స్‌ పవర్‌ లిస్ట్‌ లో స్టంట్ కొరియోగ్రాఫర్ అన్బిరివ్‌, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్‌, సౌండ్ డిజైనర్ రసూల్‌ పూకుట్టి, ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్‌, ఎడిటర్ శ్రీకర్‌ ప్రసాద్‌, సలార్ ఎడిటర్ ఉజ్వల్‌ కుల్‌కర్ణి, రచయిత వి.విజయేంద్రప్రసాద్‌ ఉన్నారు. వీరితో పాటుగా అమిత్‌ రే, సుబ్రత చక్రవర్తి, అనిల్‌ మెహతా, బిశ్వదీప్‌ ఛటర్జీ, బాస్కో-సీజర్‌, ఏకా లహానీ, గిరీశ్‌ గంగాధరన్‌, మనీశ్‌ మల్హోత్ర, మిక్కీ కాంట్రాక్టర్‌, ముకేశ్‌ ఛబ్రా, నమిత్‌ మల్హోత్ర, నితిన్‌ బైదీ, పంకజ్‌ కుమార్‌, శ్రీధర్‌ రాఘవన్‌, సుదీప్‌ ఛటర్జీ, సుదీప్‌ శర్మ, సుజాన్నే కప్లాన్‌ మేర్వాన్జీ, శ్యామ్‌ పుష్కరన్‌ ఈ జాబితాలో చోటు సంపాదించారు.

ఓవరాల్ గా చూసుకుంటే 'FC-Ormax 2024' పవర్ లిస్టులో దక్షిణాది నటీనటులు, సాంకేతిక నిపుణుల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి గత కొన్నేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమలో సౌత్ సినిమాల హవా నడుస్తోంది. మన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. నార్త్ సర్క్యూట్స్ లో భారీ వసూళ్లను రాబడుతున్నాయి. భాషా ప్రాంతీయత అడ్డంకులు చెరిపేయడంతో.. మన హీరోలు, టెక్నిషియన్స్ గురించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవర్ లిస్టులో చోటు సంపాదించారని భావించవచ్చు.