ఆ వార్ లో దిగేది ఎవరు..?
స్టార్ సినిమాలకు ఫెస్టివల్ రిలీజ్ ఎంత ముఖ్యమో సమ్మర్ కూడా అదే రేంజ్ లో హంగామా ఉంటుంది
By: Tupaki Desk | 5 Aug 2024 5:32 AM GMTస్టార్ సినిమాలకు ఫెస్టివల్ రిలీజ్ ఎంత ముఖ్యమో సమ్మర్ కూడా అదే రేంజ్ లో హంగామా ఉంటుంది. పండుగ నాడు ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించేలా తమ సినిమాల రిలీజ్ ప్లాన్ చేసే స్టార్స్ సమ్మర్ ని కూడా వదలకుండా తమ సినిమాలు అందిస్తుంటారు. సంక్రాంతి ఫైట్ తర్వాత సమ్మర్ కి భారీ సినిమాలు టార్గెట్ పెట్టుకుంటాయి. ఐతే ఈ ఇయర్ సమ్మర్ చాలా నీరసంగానే గడిచింది. రిలీజ్ అవుతాయనుకున్న దేవర, కల్కి సినిమాలు వాయిదా పడటంతో ఆ ప్లేస్ లో కొన్ని సినిమాలు వచ్చినా సమ్మర్ కి కావాల్సినంత కిక్ ఇవ్వలేదు.
కల్కి జూన్ లో రిలీజై సూపర్ హిట్ అయ్యింది. దేవర సెప్టెంబర్ 27న వస్తుంది. ఐతే 2024 సమ్మర్ ఇలా ముగిసింది. నెక్స్ట్ సమ్మర్ ఎలా ఉండబోతుంది అన్నది ఎగ్జైటింగ్ గా మారింది. సమ్మర్ లో స్కూల్స్ హాలీడేస్ ఇస్తారు. ఆ టైం లో స్టార్ సినిమాలు రిలీజైతే ఫ్యామిలీ మొత్తం సినిమా చూసే ఛాన్స్ ఉంటుంది. ఐతే నెక్స్ట్ సమ్మర్ కూడా పెద్ద పోటీ ఉండేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇయర్ సెప్టెంబర్, డిసెంబర్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్స్ మళ్లీ సమ్మర్ కి మరో సినిమా దించే ఛాన్స్ లేదు.
2025 సమ్మర్ కి ప్రస్తుతానికి రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ఒక్కటే రిలీజ్ లాక్ చేసుకుంది. ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ దేవర ఈ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుండగా ఒకవేళ పూర్తైతే మాత్రం బాలీవుడ్ మూవీ వార్ 2 సమ్మర్ రేసులో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 ఈ డిసెంబర్ కి వస్తుంది. సో బన్నీ కూడా నెక్స్ట్ సమ్మర్ రేసులో ఉండే ఛాన్స్ లేదు.
చరణ్ సినిమా గేమ్ చేంజర్ కూడా ఇయర్ ఎండింగ్ కల్లా వస్తుందని టాక్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ప్లాన్ చేస్తున్నారు. అది కుదరకపోతే సంక్రాంతికి ఫిక్స్ అంటున్నారు. ఐతే పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా నెక్స్ట్ సమ్మర్ రేసులో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఓజీ వస్తే నెక్స్ట్ సమ్మర్ కేవలం ప్రభాస్, పవన్ సినిమాలే హడావిడి చేసే ఛాన్స్ ఉంది.
ధనుష్ చేస్తున్న కుబేర రిలీజ్ అనౌన్స్ చేయలేదు. మరోపక్క విజయ్ గౌతం తిన్ననూరి నెక్స్ట్ మార్చి 29 రిలీజ్ లాక్ చేసుకున్నారు. నాని సరిపోదా శనివారం తర్వాత చేసే సినిమా ఏమైనా సమ్మర్ కి రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఐతే నెక్స్ట్ సమ్మర్ కి కె.జి.ఎఫ్ హీరో యశ్ టాక్సిక్ రేసులో దిగుతుంది. ఆ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. మొత్తానికి ఈ ఇయర్ చప్పగా సాగిన సమ్మర్ నెక్స్ట్ ఇయర్ మాత్రం లెక్కకు మించి ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు.