Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బిజినెస్.. ఎంత కష్టమొచ్చిందో..

గత కొంత కాలంగా రిలీజైన భారీ బడ్జెట్​ సినిమాల రిజల్ట్స్​.. డిస్ట్రిబ్యూటర్స్​ - బయర్స్​లో ఓ భయాన్ని సృష్టించాయి. చాలా మంది నష్టపోవాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 12:30 AM GMT
టాలీవుడ్ బిజినెస్.. ఎంత కష్టమొచ్చిందో..
X

బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు కంటెంట్​ పరంగా క్లిక్ అయినా, వసూళ్ల విషయంలో బోల్తా కొడుతుంటాయి. వాటి నిర్మాణ ఖర్చులు(పెట్టుబడులు) కూడా తిరిగి రావు. కొన్ని మిక్స్​డ్​ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్లను అందుకుంటుంటాయి. బ్రేక్ ఈవెన్‌లో టార్గెట్​ను కంప్లీట్ చేస్తాయి.ఈ మధ్య ఇలాంటివి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనివల్ల గణణీయంగా కొత్త చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్​పై కూడా​ ఎఫెక్ట్ పడుతోంది.

ముఖ్యంగా టాలీవుడ్ బాక్సాఫీస్​ థియేట్రికల్ బిజినెస్ మెల్లగా సంక్షోభంలోకి జారిపోతుందని తెలుస్తోంది. రీసెంట్​గా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న థియేటర్ బిజినెస్​లో చాలా మార్పులు వచ్చాయి. బడా స్టార్స్​ గత సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకున్నప్పటికీ వారి కొత్త చిత్రాలకు భారీ రేంజ్​లో డబ్బులు పెట్టి కొనేందుకు బయర్లు ఆసక్తి చూపట్లేదని తెలుస్తంది. వారంతా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. భారీ హైప్​తో రానున్న పాన్ ఇండియా సినిమా సలార్ విషయంలోనూ ఇదే జరిగింది.

దర్శకుడు ప్రశాంత్​ నీల్​ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి సలార్​ కోసం పని చేసినప్పటికీ..ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్​.. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి రికార్డ్​లను బ్రేక్ చేయలేదు! గతంలో వచ్చిన ఆర్​ఆర్​ఆర్​ను అధిగమించలేకపోయింది. ఆంధ్ర - తెలంగాణలో సలార్ థియేట్రికల్ బిజినెస్​ రూ.170కోట్లు జరిగిందని అన్నారు. అంటే ఆర్​ఆర్​ఆర్​ కన్నా రూ.40కోట్లు తక్కువన్నమాట.

మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలోనూ ఇదే జరగొచ్చనే మాటలు ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతి బరిలోకి దిగే సినిమాల లిస్ట్ పెద్దగా ఉండడంతో టఫ్​​ కాంపిటీషన్ ఏర్పడి బయర్స్​ రిస్క్​ తీసుకోవడానికి ఆలోచిస్తారని అంటున్నారు.

గత కొంత కాలంగా రిలీజైన భారీ బడ్జెట్​ సినిమాల రిజల్ట్స్​.. డిస్ట్రిబ్యూటర్స్​ - బయర్స్​లో ఓ భయాన్ని సృష్టించాయి. చాలా మంది నష్టపోవాల్సి వచ్చింది. అందుకే వారంతా ఇకపై భారీ బడ్జెట్ చిత్రాలపై రిస్క్ చేయాలని అనుకోవట్లేదట. ఈ సమస్యను అధిగమించడం మేకర్స్​కు పెద్ద సవాల్​గా మారింది. చూడాలి మరి ఈ పరిస్థితి మున్ముందు ఎక్కడి వరకు వెళ్తుందో..