Begin typing your search above and press return to search.

హీరోల మార్కెట్.. బడ్జెట్ మాత్రం అంతకుమించి!

కానీ టైర్ 2, అంతకంటే తక్కువ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా పాన్ ఇండియా కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 July 2024 7:30 AM GMT
హీరోల మార్కెట్.. బడ్జెట్ మాత్రం అంతకుమించి!
X

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా కల్చర్ ఎక్కువైంది. రీజనల్ పరిధికి పరిమితమయ్యే కథలతో సినిమాలు చేస్తే ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రావడం లేదు అని హీరోలు బలంగా నమ్ముతున్నారు. అందుకే లార్జెర్ దెన్ లైఫ్ లాంటి కథలను ఎంచుకొని మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. టైర్ 1 హీరోలుగా ఉన్న డార్లింగ్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తే కనీసం 200 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుంది.

అయితే ఈ హీరోలకు మార్కెట్ ఉంది కాబట్టి బడ్జెట్ ఎంత పెట్టిన కూడా రికవరీ సాధ్యం అవుతుందనే నమ్మకం నిర్మాతలలో ఉండొచ్చు. కానీ టైర్ 2, అంతకంటే తక్కువ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా పాన్ ఇండియా కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తమను తాము కొత్తగా రిప్రజెంట్ చేసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. దీంతో కథలు ఎంపికలో కూడా వారి ప్రయారిటీ మారింది. అయితే లార్జెర్ దెన్ లైఫ్ లాంటి కథలు చేయాలంటే చిన్న హీరోలు వారి మార్కెట్ కి మించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. నిర్మాతలు కూడా హీరోల ఇమేజ్ తో సంబంధం లేకుండా కంటెంట్ ని బలంగా నమ్ముతున్నారు.

దీంతో యూనివర్సల్ గా వర్క్ అవుట్ అయ్యే కథలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనుకాడటం లేదు. సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా బడ్జెట్ 120 కోట్లకు పైగానే అని తెలుస్తుంది. తేజ్ మార్కెట్ చూసుకుంటే గట్టిగా 30 కోట్లకు మించి లేదు. ఆయన చేసిన 'విరూపాక్ష’ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ సాధించింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'క’ అనే సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతూ ఉండడం విశేషం. కిరణ్ అబ్బవరం మొదటి మూడు సినిమాలు తప్ప మిగిలినవేవీ కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

అయినా కూడా కొత్త సినిమాను ఖర్చుకి వెనకాడకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అది కూడా కొత్త దర్శకులతో ఈ మూవీ చేస్తూ ఉండడం విశేషం. ఇక యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో గ్రాండ్ విక్టరీ అందుకున్నాడు. ఈ సినిమా హీరో ఇమేజ్ బట్టి కాకుండా కేవలం కథ ప్రేక్షకులకు నచ్చడంతోనే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం తేజ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే పాన్ మూవీ చేస్తున్నాడు.

దీనికోసం 60 కోట్లకు పైగానే బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అతని కంటెంట్ మీద నమ్మకంతో భారీగా పెట్టుబడి పెడుతుంది. అలాగే నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు సినిమా కూడా 80 కోట్లకు పైగా బడ్జెట్ తో రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది.

ఈ హీరోలు మార్కెట్ తక్కువగా ఉన్న కూడా బలమైన కథలతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటామని భావిస్తున్నారు. నిర్మాతలు కూడా కథల మీద నమ్మకంతోనే భారీ బడ్జెట్ లు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇవి వర్క్ అవుట్ అయితే మాత్రం భవిష్యత్తులో నిర్మాతలు మరల హీరోల మార్కెట్ బట్టి కాకుండా కథలను దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.