Begin typing your search above and press return to search.

టైర్​-2 హీరోస్​ వరల్డ్​వైడ్​ బిజినెస్​.. నెం.1లో ఎవరంటే?

అంతకుముందు విజయ్​ 'లైగర్​'కు దాదాపు రూ.88.40కోట్లతో మొదటి స్థానంలో ఉంది. కానీ ఈ చిత్రం భారీ నష్టాల్ని మిగిల్చింది

By:  Tupaki Desk   |   30 Aug 2023 8:20 AM GMT
టైర్​-2 హీరోస్​ వరల్డ్​వైడ్​ బిజినెస్​.. నెం.1లో ఎవరంటే?
X

ఆగస్ట్​ బాక్సాఫీస్ ముగిసింది. మరో రెండు రోజుల్లో సెప్టెంబర్​ మొదలుకానుంది. దీంతో సినీ ప్రియులంతా సెప్టెంబర్​లో రాబోయే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సెప్టెంబర్​ బాక్సాఫీస్​ .. విజయ్​ దేవరకొండ-సమంత కలిసి నటించిన ఖుషి రిలీజ్​తో మొదలుకానుంది. ఆ తర్వాత నాని హాయ్​ నాన్న, రామ్ పోతినేని స్కంద వంటి చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఇలా వరుసగా టైర్​-2 హీరోల సినిమాలు రానున్నాయి.

అయితే ఖుషి ప్రీ రిలీజ్​ బిజినెస్​ బాగానే జరిగినట్లు తెలిసింది. అంతకముందు 'లైగర్'​-'శాకుంతలం' చిత్రాలు భారీ డిజాస్టర్​ టాక్ అందుకున్న.. ఖుషికి మంచి వ్యాపారమే జరిగింది. దాదాపు రూ.52.50కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందింది. టాలీవుడ్​ టైర్​-2 హీరోల విషయానికొస్తే.. ఈ సినిమా వరల్డ్​ వైడ్​గా బిజినెస్​ రెండో స్థానంలో నిలిచింది.

అంతకుముందు విజయ్​ 'లైగర్​'కు దాదాపు రూ.88.40కోట్లతో మొదటి స్థానంలో ఉంది. కానీ ఈ చిత్రం భారీ నష్టాల్ని మిగిల్చింది. ఇక మూడో స్థానంలో నేచురల్ స్టార్ నాని దసరా రూ.50కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్​ను జరుపుకుంది. బిజినెస్​కు తగ్గట్టే.. మంచి వసూళ్లను సాదించింది. ఏకంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్​ను ఖాతాలో వేసుకుంది. దీంతో 'హాయ్ నాన్న' బిజినెస్​ కూడా భారీగానే జరిగే అవకాశముందని తెలుస్తోంది.

ఇక అక్కినేని అఖిల్ నటించిన తొలి సినిమానే 'అఖిల్'​ రూ.42కోట్ల వరకు చేసుకుంది. అరంగేట్రం హీరోకు ఆ రేంజ్​లో బిజినెస్ జరగడం మాములు విషయం కాదు. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేక బోల్తా కొట్టింది. ఆ తర్వాత అఖిల్ చేసిన పలు చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రీసెంట్​గా వచ్చిన ఏజెంట్​ కూడా డిజాస్టర్​గా నిలిచింది. ఈ సినిమా 36.02కోట్ల వ్యాపారాన్ని చేసుకుని నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చింది.

ఇక ఐదో స్థానంలో రామ్​పోతినేని ది వారియర్​ మూవీ బిజినెస్​ రూ.38.10కోట్లు చేసుకోగా.. ఈ సినిమా కూడా అట్టర్​ఫ్లాప్​గా నిలిచింది. ప్రస్తుతం రామ్​ నటించిన స్కంద్ రిలీజ్​కు రెడీ అయింది. ఈ సినిమా బిజినెస్​పై ఇంకా క్లారిటీ రాలేదు. ​ఆరో స్థానంలో అఖిల్ ఏజెంట్​ రూ.36.02కోట్లతో నిలిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్​ రూ.34.60కోట్లు, బెల్లంకొండ శ్రీనివాస్ జయజానకి నాయక రూ.34కోట్లు బిజినెస్​ను చేసుకున్నాయి.