టాలీవుడ్ లో బాలీవుడ్ కి సీక్వెల్?
స్కూల్లో పనిచేసే టీచర్...రెస్టారెంట్ నిర్వహించే కరీనా.. ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ కథ నడుస్తుంది. నెరేషన్ స్లో గా ఉన్నా...ప్రతీది లాజిక్ గా ఉంటుంది
By: Tupaki Desk | 10 Oct 2023 12:30 AM GMTటాలీవుడ్ లో బాలీవుడ్ కి సీక్వెల్ షురూ కాబోతుందా? అదీ ఓ యావరేజ్ చిత్రంతో హిట్ కోసం సాహసం చేస్తున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. ఇటీవలే కరీనా కపూర్ ప్రధాన పాత్రలో సుజోయ్ ఘోష్ 'జానేజాన్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఓ మర్డర్ చుట్టూ కథ నడుస్తుంది. ఓ మ్యాథమెటికల్ థీయరీ అధారంగా రూపొం దించారు.
స్కూల్లో పనిచేసే టీచర్...రెస్టారెంట్ నిర్వహించే కరీనా.. ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ కథ నడుస్తుంది. నెరేషన్ స్లో గా ఉన్నా...ప్రతీది లాజిక్ గా ఉంటుంది. దీనికొక చిన్న ఎమోషన్ జోడించి ఆద్యంతం రక్తి కట్టించారు. క్రైమ్ స్టోరీలు కొత్త కానప్పటికీ...సుజోయ్ క్రైమ్ ని దాచే ప్రయత్నాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం కొంత వరకూ సక్సెస్ అయింది. అందుకే ఇప్పుడీ ఈసినిమా రీమేక్ రైట్స్ ని నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ తీసుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
ఈ సినిమాని ఓ రీమేక్ గా కాకుండా సీక్వెల్ గా చేస్తే బాగుంటుంది అన్నది ఐడియా అట. క్రైమ్ స్టోరీలు రీమేక్ కంటే కంటున్యూటీగా ఓ కొత్త కథని చెప్పడం బెటర్ అన్న ఐడియా నుంచి నాని ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కేవలం 'జానే జాన్' రైట్స్ లాజిక్ కోసమే తీసుకున్నారుట. తదుపరి ఎలాంటి చట్టపరమైన చర్యలు రాకుండానే రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఏంటో నిర్మాణ సంస్థ ధృవీకరించాల్సి ఉంది.
టాలీవుడ్ లో ఈ జానర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే హిట్ ప్రాంచైజీ అలాగే కొనసాగుతుంది. రెండు భాగాలు హిట్ అయ్యాయి. మూడో భాగం కోసం నేరుగా నానినే రంగంలోకి దిగుతున్నాడు. తొలుత నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ చూసి నాని బరిలోకి వచ్చాడు. ఇప్పుడు అదే జానర్ క్రైమ్ స్టోరీ రైట్స్ పై ఆసక్తి చూపిండం ఇంట్రెస్టింగ్.