Begin typing your search above and press return to search.

బాలీవుడ్ 5000 కోట్లు.. మనోళ్ళు బ్రేక్ చేస్తారా?

కాబట్టి 2024 లో మళ్లీ టాలీవుడ్, బాలీవుడ్ ని బీట్ చేసే విధంగా హైలెట్ అవుతుంది అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 3:30 AM GMT
బాలీవుడ్ 5000 కోట్లు.. మనోళ్ళు బ్రేక్ చేస్తారా?
X

గడిచిన ఐదేళ్ల కాలంలో సినిమా ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. కంటెంట్ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద రారాజుగా నిలుస్తుంది అని కొన్ని చిన్న సినిమాలు నిరూపించాయి. ఇక భాషతో కూడా సంబంధం లేదు అనే విధంగా ఎన్నో సినిమాలు దేశాలు దాటి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక తెలుగులో అయితే రాజమౌళి పాన్ ఇండియా అనే పదానికి అసలైన అర్ధాన్ని తీసుకువచ్చి మార్కెట్ ను మరింత విస్తరింప చేశాడు.

ఇక ఇప్పుడు బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఎందులోను తక్కువ కాదు అనే విధంగా దూసుకుపోతోంది. మన హీరోలు ఎంచుకుంటున్న కధలు కూడా ఆ రేంజ్ లో ఉంటున్నాయి. అలాగే నిర్మాతలు కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇక దర్శకులు కూడా వారి పనితనంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం ఆశ్చర్యపరుస్తున్నారు.

అయితే ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని మేజర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఐదు వేల కోట్ల రేంజ్ లో అయితే హడావిడి చేయగలవు అని అనిపిస్తోంది. ఇప్పటికే పఠాన్, గదర్2, జవాన్, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ వంటి భారీ హిట్‌ల తర్వాత బాలీవుడ్ మళ్లీ దేశంలోనే నంబర్ 1 పరిశ్రమగా అవతరించింది. టైగర్ 3, యానిమల్, డంకీ వంటి రాబోయే చిత్రాలు కూడా చాలా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.

దీంతో గ్రాస్ కలెక్షన్స్ ఈజీగా ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోని 5 వేల కోట్లు దాటగలవు అని అంచనా వేస్తున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే కొన్ని మేజర్ సినిమాలు కూడా ఈ రికార్డును బ్రేక్ చేసే సత్తా మాత్రం ఉందని చెప్పవచ్చు అందులో ముఖ్యంగా ప్రభాస్ సలార్ సినిమా పైన అందరి ఫోకస్ ఉంది. ఈ సినిమా క్లిక్ అయితే మాత్రం ఈజీగా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి నుంచి 1500 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టగలదు.

ఇక మరోవైపు 2004లో అయితే అంతకుమించి అనేలా మరికొన్ని బడా సినిమాలను ఉన్నాయి. అందులో కూడా ప్రభాస్ ప్రాజెక్ కె కల్కి పై 1000 కోట్లకు పైగా ఆశలు ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా అదే తర హాలో రికార్డులు బ్రేక్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఇక మరోవైపు దేవర, గేమ్ ఛేంజర్ రెండు సినిమాలు కూడా పర్ఫెక్ట్ గా క్లిక్ అయితే రెండు కలిపి 1200 కోట్ల వరకు బిజినెస్ చేయగలవు. కాబట్టి 2024 లో మళ్లీ టాలీవుడ్, బాలీవుడ్ ని బీట్ చేసే విధంగా హైలెట్ అవుతుంది అని చెప్పవచ్చు.