దేవర - పుష్ప - గేమ్ ఛేంజర్.. అక్కడ బజ్ ఎలా ఉంది?
పుష్ప సినిమాలు మాత్రమే తమిళనాడులో కొంత ప్రభావం చూపించాయి. తమిళ్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యి మంచి వసూళ్లు సాధించాయి.
By: Tupaki Desk | 31 May 2024 5:31 AM GMTతమిళ స్టార్ హీరోల సినిమాలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. కొన్ని సినిమాలైతే తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్స్ అయ్యాయి. అయితే తెలుగు సినిమాలకి మాత్రం తమిళంలో పెద్దగా ఆదరణ ఉండదు. మన స్టార్ హీరోల చిత్రాలని తమిళ్ ఆడియన్స్ ఆదరించిన సందర్భాలు చాలా తక్కువ. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్. పుష్ప సినిమాలు మాత్రమే తమిళనాడులో కొంత ప్రభావం చూపించాయి. తమిళ్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యి మంచి వసూళ్లు సాధించాయి.
అయితే ఇప్పుడిప్పుడే తమిళ్ ఆడియన్స్ ఆలోచన కూడా మారుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో అరడజనుకి పైగా పాన్ ఇండియా సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. వీటిలో మోస్ట్ అవైటెడ్ మూవీగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ ఉంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది.
పుష్ప మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగ్ కి తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ కి ఇప్పటి వరకు 6.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే 91కె లైక్స్ రావడం విశేషం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ దేవర. ఈ సినిమా ఫస్ట్ సాంగ్ కి కూడా తమిళంలో మంచి ఆదరణ లభించింది.
అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. మూవీ నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ కి 6.2 మిలియన్ వ్యూస్ రాగా 201కె లైక్స్ వచ్చాయి. అంటే లైక్స్ పరంగా దేవర ఫియర్ సాంగ్ తమిళంలో టాప్ లో నిలిచిందని చెప్పొచ్చు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ 2.5 మిలియన్ వ్యూస్ 51కె లైక్స్ సొంతం చేసుకుంది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ మూడు సినిమాలలో పుష్ప సినిమాకి ఎక్కువ వ్యూస్ రావడానికి కొన్ని రీజన్స్ ఉనాన్యి. పుష్ప మొదటి పార్ట్ తమిళంలో హిట్ అయ్యింది. వారి నేటివిటీకి పుష్ప ది రూల్ మూవీ దగ్గరగా ఉంటుంది. ఇక దేవర మూవీ సాంగ్ కి మంచి ఆదరణ వచ్చిందంటే అనిరుద్ రవిచందర్ వలనే అని చెప్పాలి. గ్యాంగ్ చేంజర్ మూవీని తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తూ ఉండటం ఈ చిత్రంపై అక్కడి ఆడియన్స్ ఫోకస్ ఉంది. సాంగ్స్ పరంగా తమిళ్ ఆడియన్స్ ని మెప్పించిన ఈ చిత్రాలు ఆ భాషలో ఏ మేరకు సక్సెస్ అందుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.