Begin typing your search above and press return to search.

దేవర, ఓజీ, గేమ్ ఛేంజర్.. ఇదేం ట్విస్ట్?

టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత ఒక్క స్టార్ హీరో మూవీ కూడా రిలీజ్ కాలేదన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Jun 2024 4:55 PM GMT
దేవర, ఓజీ, గేమ్ ఛేంజర్.. ఇదేం ట్విస్ట్?
X

టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత ఒక్క స్టార్ హీరో మూవీ కూడా రిలీజ్ కాలేదన్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ పొంగల్ విన్నర్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీతో పాటు స్టార్ హీరోలు నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ కల్కి సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. దీంతో 2024 ఫస్టాప్ లో పెద్ద చిత్రాల సౌండ్ ఎక్కువగా లేదు.

అయితే జూన్ నుంచి టాలీవుడ్ లో భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఫస్ట్ కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ఆ తర్వాత వరుసగా బడా హీరోల చిత్రాలు సందడి చేయనున్నాయి. ఆగస్ట్ 15వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2, సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ఓజీ, అక్టోబర్ 10న తారక్ దేవర విడుదల అవ్వనున్నాయి. బాలయ్య NBK 109 దసరా కానుకగా విడుదల కానుందని టాక్. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు.

ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దేవర రిలీజ్ డేట్ పై గేమ్ ఛేంజర్ మేకర్స్ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. దీంతో అక్టోబర్ లో రిలీజ్ చేస్తే బెటర్ అని మేకర్స్ యోచిస్తున్నారట. ఇటీవల దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి.. తిరుమలలో అక్టోబర్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉంటుందని అన్నారు. దీంతో అంతా సెట్ అయినట్లు తెలుస్తోంది.

అయితే దేవర రిలీజ్ డేట్ ఇప్పుడు కాస్త ముందుకు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ పార్ట్ చాలా వరకు కంప్లీట్ అయిందట. దీంతో ప్రమోషన్స్ కు కూడా టైం ఉండడంతో సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నారని వినికిడి. ఇక ఆ డేట్ కే షెడ్యూల్ అయిన పవన్ ఓజీ చిత్రం.. డిసెంబర్ కు పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. దీంతో సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడతారో తెలియదు. అందుకే ఓజీ.. షూటింగ్ ఇప్పట్లో కంప్లీట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఓజీ డిసెంబర్ కు పోస్ట్ పోన్ అవుతుందని.. సెప్టెంబర్ కు దేవర ప్రీ పోన్ అవ్వనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అక్టోబర్ లో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో చూడాలి.