Begin typing your search above and press return to search.

మహేష్ నుంచి అఖిల్ వరకు.. గెట్ రెడీ!

టాలీవుడ్ లు ప్రస్తుతం చాలా సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అలాగే కొన్ని మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి

By:  Tupaki Desk   |   5 Aug 2024 4:27 AM GMT
మహేష్ నుంచి అఖిల్ వరకు.. గెట్ రెడీ!
X

టాలీవుడ్ లు ప్రస్తుతం చాలా సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అలాగే కొన్ని మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకం అని చెప్పాలి. ఆడియన్స్ కూడా ఈ సినిమాల అప్డేట్స్ గురించి క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. టైర్ 1, టైర్ 2 హీరోల నుంచి రాబోతున్న సినిమాలే వీటిలో మెజారిటీగా ఉన్నాయి. కచ్చితంగా 2024 ద్వితీయార్ధం, 2025 ప్రథమార్ధం టాలీవుడ్ నుంచి ఇంటరెస్టింగ్ మూవీస్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయని అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే అర్ధమవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ టీజర్ ఆగష్టు 22న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. నెక్స్ట్ నందమూరి బాలయ్య, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న NBK109 మూవీ టైటిల్ రివీల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కింగ్ నాగార్జున సంక్రాంతికి కొత్త సినిమాతో రావాలని అనుకుంటున్నారు. త్వరలో ఆ సినిమాకి సంబందించిన ఎనౌన్స్ మెంట్ ఉండొచ్చని సమాచారం.

అలాగే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్, వీలైతే టైటిల్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే ఆగష్టు 15న రిలీజ్ కాబోయే రవితేజ మిస్టర్ బచ్చన్ వరుస అప్డేట్స్ ట్రైలర్ లాంటివి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాయి. మిక్కీ జి మియర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నెక్స్ట్ రిలీజ్ డేట్ పై ఎనౌన్స్ మెంట్ వస్తుందనే ప్రచారం నడుస్తోంది.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ SSMB29 ఎనౌన్స్ మెంట్ మరో రెండు నెలల్లో రావొచ్చంట. డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ రాజాసాబ్ మూవీ గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర సెకండ్ సింగిల్ ని ఆగష్టులో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట. అలాగే అల్లు అర్జున్ పుష్ప ది రూల్ టీజర్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్, విజయ్ దేవరకొండ VD12 ఫస్ట్ లుక్ గ్లింప్స్, నాని సరిపోదా శనివారం థర్డ్ సింగిల్, రామ్ పోతినేని మల్టీస్టారర్ అప్డేట్, నాగ చైతన్య తండేల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్, రాబిన్ హుడ్ ఫస్ట్ సింగిల్, అఖిల్ నెక్స్ట్ మూవీ అప్డేట్ కూడా రావాల్సి ఉంది.