Begin typing your search above and press return to search.

మ‌న‌కి అవార్డులొస్తే వాళ్లంద‌రికీ క‌డుపు మంటే!?

ఓ వైపు సినిమాకి భాష‌తో సంబంధం లేదంటూ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అంద‌ర్నీ క‌లుపుకుని ముందుకెళ్తుందో చూస్తూనే ఉన్నాం.

By:  Tupaki Desk   |   4 Sep 2023 6:09 AM GMT
మ‌న‌కి అవార్డులొస్తే వాళ్లంద‌రికీ క‌డుపు మంటే!?
X

ఓ వైపు సినిమాకి భాష‌తో సంబంధం లేదంటూ తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అంద‌ర్నీ క‌లుపుకుని ముందుకెళ్తుందో చూస్తూనే ఉన్నాం. భాష‌లు వేరైనా మ‌న‌మంతా భార‌తీయులం అనే నినాదం తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఎప్ప‌టి నుంచో బ‌లంగా ఉంది. అందుకే భాష‌తో సంబంధం లేకుండా అన్ని భాష‌ల న‌టీన టుల‌కు తెలుగు ప‌రిశ్ర‌మ అవ‌కాశాలు క‌ల్పిస్తుంది. ఈ విష‌యంలో టాలీవుడ్ దేశంలో అన్ని భాష‌ల‌కంటే ముంద‌జ‌లో ఉంది.

అందుకే కోలీవుడ్ నుంచి విజ‌య్..ధ‌నుష్‌..సూర్య‌..కార్తీ..విశాల్ లాంటి వారు ఇక్క‌డా రాజ్య‌మేల గ‌ల్గుతున్నారు. బాలీవుడ్ న‌టులు కూడా తెలుగు సినిమా గురించి అన్ని సంద‌ర్భాల్లో కాక‌పోయినా కొన్ని సంద‌ర్భాల్లోనైనా ఎంతో గొప్ప‌గా మాట్లాడిన స‌న్నివేశాలున్నాయి. ఇక అవార్డుల ప‌రంగా తెలుగు ప‌రిశ్ర‌మ ఎప్పుడూ మాకే అన్ని అవార్డులు రావాల‌ని ప‌ట్టు బ‌ట్టింది లేదు. వ‌స్తే తీసుకోవ‌డం లేక‌పోతే సైలెంట్ గా ఉంటటం త‌ప్ప ప‌క్క వాళ్ల‌ని చూసి అసూయ ప‌డిన సంద‌ర్భం ఎన్న‌డూ లేదు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డు వ‌చ్చింద‌న్నా..ఆర్ ఆర్ ఆర్ ప‌లు విభాగాల్లో అవార్డులు ద‌క్కాయ‌న్నా! కేవ‌లం ఇదంతా ప్ర‌తిభ‌తో మాత్ర‌మే సాధ్యమైంద‌ని అంద‌రికీ తెలుసు. అయితే అవార్డుల విష‌యంలో మాకు అన్యాయం జ‌రిగిందంటూ సాక్షాత్తు త‌మిళ‌నాడు సీఎం ల‌బోదిబో వైనం తెలిసిందే. ఒక‌రు తానా అంటే మ‌రొక‌రు తందానా? అన‌డం అక్క‌డ ఎప్ప‌టి నుంచో ఉన్న క‌ల్చ‌ర్.

దానికి త‌గ్గ‌ట్టే ఇటీవ‌ల న‌టుడు విశాల్ కూడా అవార్డుల‌ను ఎలా కించ‌ప‌రిచాడో తెలిసిందే. ప్రేక్ష‌కుల మించిన అవార్డు ఏముంటుంద‌ని....ఒక వేళ అవార్డులొచ్చినా చెత్త బుట్ట‌లో వేస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. దీంతో సోష‌ల్ మీడియాలో వాడే వేడి చ‌ర్చకు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమాకు అవార్డులు రావ‌డం..అందులోనూ ఉత్తమ న‌టుడు అవార్డు బ‌న్నీకి రావ‌డంతో కోలీవుడ్ జీర్ణించుకోలే క‌పోతుంద‌ని చెప్పొచ్చు.

అవార్డులే వృద్ధా అన్న‌ట్లు విశాల్ మాట వెనుక అసూయ క‌నిపిస్తుంద‌ని తెలుగు అభిమానులు మండి ప‌డుతున్నారు. ఇవే అవార్డులు త‌మిళ న‌టుల‌కు వ‌చ్చిన‌ప్పుడు విశాల్ ఎన్నో సంద‌ర్భాల్లో విష్ చేసారు. కానీ తెలుగు సినిమాకి అవార్డులు విష్ చేయ‌క‌పోగా..వాటిని కించ ప‌రిచి మాట్లాడ‌టం వెనుక క‌డుపు మంట ఉందంటూ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొస్తుంది. వాస్త‌వానికి నాటు నాటు కి ఆస్కార్ అవార్డు ద‌క్కిన‌ప్పుడు కూడా కొంత మంది కోలీవుడ్ న‌టులు త‌ప్ప చాలా మంది స్పందించ‌ని సంగ‌తి తెలిసిందే.