Begin typing your search above and press return to search.

ఆలస్యం అమృతమే కాదు విషం కూడా..?

హిట్టు కొట్టినా ఫ్లాప్ పడినా సినిమా వెంట సినిమా చేస్తేనే కానీ ఆడియన్స్ ఆ హీరోని కానీ డైరెక్టర్ ని కానీ ఫాలో అవ్వరు.

By:  Tupaki Desk   |   16 July 2024 6:22 AM GMT
ఆలస్యం అమృతమే కాదు విషం కూడా..?
X

హిట్టు కొట్టినా ఫ్లాప్ పడినా సినిమా వెంట సినిమా చేస్తేనే కానీ ఆడియన్స్ ఆ హీరోని కానీ డైరెక్టర్ ని కానీ ఫాలో అవ్వరు. అలాంటిది సినిమాకు సినిమాకు లాంగ్ గ్యాప్ తీసుకుంటే మాత్రం వెనుకబడిపోతారు. టాలీవుడ్ లో కొందరు యువ హీరోల పరిస్థితి ఇలానే ఉంది. హిట్టు కొట్టిన హీరోలు నెక్స్ట్ సినిమా విషయంలో లేట్ చేస్తుంటే ఫ్లాపులు చూసిన యువ హీరోలు కూడా తర్వాత సినిమా ఏం చేయాలో అర్థం కాక టైం వేస్ట్ చేసుకుంటున్నారు.

యంగ్ హీరోల్లో తన టాలెంట్ మెప్పిస్తూ వస్తున్న నవీన్ పొలిశెట్టి అంతకుముందు సైడ్ రోల్స్ చేసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత జాతి రత్నాలుతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో కూడా ఇంప్రెస్ చేశాడు. ఐతే హిట్టు కొట్టినా కూడా ఈ డైరెక్టర్ ఎందుకో తన నెక్స్ట్ సినిమా విషయంలో డైలమాలో ఉన్నాడు. సితార బ్యానర్ లో అనగనగా ఒక రోజు సినిమా ప్రకటించారు కానీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్టు తెలుస్తుంది.


ఐతే తన సక్సెస్ మేనియా కొనసాగించేలా మరో సూపర్ హిట్ కథతో రావాలని అనుకుంటున్నాడు నవీన్ పొలిశెట్టి కానీ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకపోవడం గురించి ఆలోచించట్లేదు. ఇక మరోపక్క తొలి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వరుస ఫ్లాప్ సినిమాలతో డీలా పడ్డాడు. చివరగా వచ్చిన ఆదికేశవ అయితే డిజాస్టర్ కా బాప్ అనిపించింది. నెక్స్ట్ సినిమా కొడితే సూపర్ హిట్ కొట్టాలనే ఆలోచనతో వైష్ణవ్ తేజ్ ఎదురుచూస్తున్నాడు.


ఇక అక్కినేని వారసుడు అఖిల్ ఏజెంట్ తర్వాత మరో సినిమా కన్ఫర్మ్ చేయలేదు. అఖిల్ భారీ సినిమా వస్తుందని మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి తగినట్టుగానే అఖిల్ తన మేకోవర్ తో కనిపిస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ సినిమా ఏంటి డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ప్రకటించలేదు. ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.


మరో పక్క యువ హీరోలంతా కూడా వరుస భారీ సినిమాలు చేస్తుంటే ఈ ముగ్గురు మాత్రం కెరీర్ లో నెక్స్ట్ ఏం చేయాలన్నది ఆలోచించుకుంటూ ఉన్నారు. ఐతే ఆలస్యం అమృతం మాత్రమే కాదు విషం అని కూడా అంటారు. మరీ లేట్ చేస్తే మాత్రం ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ హీరోలు వారి తదుపరి సినిమాల గురించి ఎలాంటి ప్లానింగ్ లో ఉన్నారన్నది తెలియాల్సి ఉంది.