Begin typing your search above and press return to search.

ఒక‌రికి క‌మిటై ఇంకొక‌రిపైకి చూపులు.. దీపిక షాక్‌లు!?

ముఖ్యంగా దీపికా పదుకొణె తన గత సంబంధాలు .. రణవీర్‌తో గ‌డిపే సమయం గురించి వెల్లడించిన విషయాలు ఇప్పుడు షాక్ కి గురి చేసాయి.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:48 AM GMT
ఒక‌రికి క‌మిటై ఇంకొక‌రిపైకి చూపులు.. దీపిక షాక్‌లు!?
X

దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్ జంట ప్రేమాయ‌ణం, అనంత‌రం పెళ్లి, కెరీర్ ప్ర‌యాణం గురించి తెలిసిన‌దే. 2018లో ఈ జంట అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే ఆ ఇద్ద‌రూ వృత్తిగ‌త జీవితానికి ఇచ్చిన ప్రాధాన్య‌త వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ఇవ్వ‌డం లేదా? అన్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌. కాఫీ విత్ కర‌ణ్ కొత్త సీజ‌న్ ఈ కొత్త డౌట్ ని రైజ్ చేసింది. దీపిక - రణవీర్ జంట తొలి ఎపిసోడ్ లో కరణ్ జోహార్ ఆ ఇద్ద‌రి పాత రిలేష‌న్ షిప్స్ గురించి త‌వ్వి తీసారు.

ముఖ్యంగా దీపికా పదుకొణె తన గత సంబంధాలు .. రణవీర్‌తో గ‌డిపే సమయం గురించి వెల్లడించిన విషయాలు ఇప్పుడు షాక్ కి గురి చేసాయి. దీపిక మాట‌ల‌కు ర‌ణ్ వీర్, క‌ర‌ణ్ ఒక్క‌సారిగా షాక్ కి గుర‌య్యారు. రణ్‌వీర్ కంటే ముందు ఇద్ద‌రితో సంబంధాలు పెట్టుకున్నానని, వారిద్దరూ తన బాధను ఏనాడూ ప‌ట్టించుకోలేద‌ని దీపికా పదుకొనే చెప్పింది. ఎప్పటికీ ఒంటరిగా ఉంటూ సరదాగా గడపాలని కోరుకున్నప్పుడు తాను రణవీర్‌ని కలిశానని, అతనితో ఉన్న స్వేచ్ఛను ఇష్టపడిన తర్వాత, తాను రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడానికి అంగీకరించానని చెప్పింది.

ర‌ణ్ వీర్ ప్ర‌తిపాదించే వ‌ర‌కూ తాను క‌మిట్ కాలేద‌నే విష‌యాన్ని కూడా తెలిపింది. అసలు త‌మ మ‌ధ్య క‌మిట్ మెంట్లు అనేవి లేవ‌ని కూడా వెల్ల‌డించింది. మేము ఒకరికోసం ఒక‌రు.. అయినా నేను ఇతర వ్యక్తులను కలిసాను. నేను ఎవ‌రిని చూసినా వారిపై నాకు ఆసక్తి లేదా ఉత్సాహం లేదు. నా మనస్సులో, నేను అతని(ర‌ణ్ వీర్‌)కి కట్టుబడి ఉన్నాను. నేను ఇతర వ్యక్తులను కలుస్తాను. కానీ తిరిగి నా గ‌మ్య స్థానానికి వ‌స్తున్నాను`` అని దీపిక తెలిపింది.

అయితే త‌న మ‌న‌సులో ర‌ణ్ వీర్ త‌ప్ప ఇత‌రులు ఉన్నార‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ వీడియో ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. దీపిక వ్యాఖ్య‌ల‌పై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ర‌ణ్ వీర్ కంటే ముందు దీపిక ప‌దుకొనే ర‌ణ‌బీర్ క‌పూర్ తో ప్రేమాయ‌ణం సాగించిన సంగ‌తి తెలిసిందే. ర‌ణబీర్ కంటే ముందు కూడా దీపిక ఒక‌రితో ప్రేమాయ‌ణం సాగించింద‌ని త‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఇప్పుడు దీపిక, ర‌ణ్ వీర్ ఇద్దరూ కెరీర్ ప‌రంగా ఎవ‌రికి వారు బిజీ. ర‌ణ్ వీర్ క‌థానాయ‌కుడిగా బిజీగా ఉండ‌గా, దీపిక న‌టిగా, నిర్మాత‌గాను కొన‌సాగుతున్నారు. ఇక కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో దీపిక ప‌దుకొనే మ‌రోసారి త‌న డిప్రెష‌న్ గురించి ఓపెనైంది. త‌న‌కు క‌ష్ట కాలంలో ర‌ణ్ వీర్ ఎలాంటి సాయం చేసాడో కూడా ఈ ఎపిసోడ్ లో రివీల్ చేసారు.