Begin typing your search above and press return to search.

ఆస్తి ఐశ్వ‌ర్యంలో టాప్ 10 గాయ‌నీమ‌ణులు

ఇండియాలో ప్ర‌తిభావంతులైన గాయ‌నీమ‌ణులు ఎంద‌రో ఉన్నారు. అయితే ఆస్తి ఐశ్వ‌ర్యంలో మేటి గాయ‌నీమ‌ణులు ఎంద‌రు ఉన్నారు?

By:  Tupaki Desk   |   28 Dec 2024 11:30 AM GMT
ఆస్తి ఐశ్వ‌ర్యంలో టాప్ 10 గాయ‌నీమ‌ణులు
X

ఇండియాలో ప్ర‌తిభావంతులైన గాయ‌నీమ‌ణులు ఎంద‌రో ఉన్నారు. అయితే ఆస్తి ఐశ్వ‌ర్యంలో మేటి గాయ‌నీమ‌ణులు ఎంద‌రు ఉన్నారు? అంటే ఒక ప‌ది మంది పేర్లు మాత్ర‌మే ప్ర‌ముఖంగా వినిపిస్తాయి. ల‌తా మంగేష్క‌ర్, తుల‌సీ కుమార్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, నేహా కక్కర్ త‌దిత‌ర గాయ‌నీమ‌ణులు భారతదేశంలోని అగ్రశ్రేణి నేప‌థ్య‌ గాయనీమ‌ణులుగా భారీగా ఆస్తులు కూడ‌బెట్టారని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అయితే దేశంలోని గాయ‌నీమ‌ణుల్లో నిక‌ర సంప‌ద‌ల ప‌రంగా నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచిన‌ది ల‌తా మంగేష్క‌ర్. స‌ద‌రు గాయ‌ని ఆస్తుల విలువ సుమారు 368కోట్లు. ఆ త‌ర్వాత‌ రూ. 200 కోట్ల నికర ఆస్తి విలువతో భారతదేశంలోనే ధనిక గాయనిగా నంబ‌ర్ 2 స్థానంలో ఉన్నారు తుల‌సీ కుమార్.

ప్ర‌ఖ్యాత టి.సిరీస్ సంస్థానం వార‌సురాలిగా, గాయ‌ని తులసి కుమార్ అసాధార‌ణ ప్ర‌జ్ఞ‌ను క‌న‌బ‌రిచారు. ఆమె ప్రముఖ సినీ నిర్మాత భూషణ్ కుమార్ కి స్వ‌యానా సోదరి. దివంగత గాయకుడు టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమార్తె. లెజెండ్ ల‌తామంగేష్క‌ర్ భార‌త‌దేశంలో సీనియ‌ర్ మోస్ట్ నేప‌థ్య‌ గాయ‌నిగా సుప‌రిచితురాలు. భార‌త‌దేశ‌పు గాన‌కోకిల‌గా, మెలోడీ క్వీన్ సుప్ర‌సిద్ధులు. భార‌తీయ సంగీతానికి ల‌తాజీ సేవ‌లు అనిత‌ర సాధ్య‌మైన‌వి. అలాగే మ్యూజిక్ లేబుల్ కుటుంబంలో లెజెండ్ కుటుంబం నుంచి వ‌చ్చిన తుల‌సీ కుమార్ తొలి నుంచి గానంపై ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తూ త‌న‌దైన ముద్ర వేసారు. కుటుంబ నేప‌థ్యం కార‌ణంగాను తుల‌సీ కుమార్ సంగీత ప్ర‌పంచంలో అత్యుత్త‌మ స్థానాన్ని అలంక‌రించారు. తుల‌సీ కుమార్ వంటి వారితో పోలిస్తే, ఎలాంటి సినీ నేప‌థ్యం లేకుండా గాయ‌నీమ‌ణులుగా ఎదిగిన వారి సంఖ్య ఎక్కువే.

భార‌త‌దేశంలో టాప్ 10 గాయ‌నీమ‌ణుల నిక‌ర ఆస్తుల‌ను ప‌రిశీలిస్తే ల‌తా మంగేష్క‌ర్, తుల‌సీ కుమార్ త‌ర్వాత స్థానాలు ఇలా ఉన్నాయి. యువ‌త‌రం హార్ట్ బీట్, మేటి ప్ర‌తిభావ‌ని శ్రేయా ఘోషల్ నికర ఆస్తి విలువ రూ. 180-185 కోట్లు. పాపుల‌ర్ గాయ‌ని సునిధి చౌహాన్ నికర ఆస్తి విలువ రూ. 110 కోట్లకు పైగా ఉండగా, ఆశా భోంస్లే నికర ఆస్తుల విలువ రూ. 80-100 కోట్లకు పైగా ఉన్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. సింగింగ్ సెన్సేషన్ నేహా కక్కర్ ఆస్తి విలువ దాదాపు రూ.104 కోట్లు కాగా ఆల్కా య‌గ్నిక్ ఆస్తులు 68కోట్లు, మోనాలీ ఠాకూర్ రూ.25 కోట్ల వ‌ర‌కూ ఆర్జిస్తున్నార‌ని సమాచారం. గాయ‌ని పాల‌క్ ముచ్చ‌ల్ ఆస్తులు సుమారు 9కోట్లు. తెలుగు చిత్ర‌సీమ నుంచి గొప్ప ప్ర‌తిభావంతులైన గాయ‌నీమ‌ణులు ఎంద‌రు ఉన్నా కానీ, వారికి జాతీయ గాయ‌నీమ‌ణుల‌తో పోలిస్తే ఫోక‌స్ త‌క్కువ అన‌డంలో సందేహం లేదు.

టాప్ 10 ధనిక భారతీయ మహిళా గాయకుల జాబితా:

1)లతా మంగేష్కర్- 368 కోట్లు

2) తులసి కుమార్- 210 కోట్లు

3) శ్రేయా ఘోషల్ -185 కోట్లు

4) సునిధి చౌహాన్ 100-110 కోట్లు

5) నేహా కక్కర్ -104 కోట్లు

6) ఆశా భోంస్లే -80-100 కోట్లు

7) అల్కా యాగ్నిక్ - 68 కోట్లు

8) మోనాలీ ఠాకూర్ - 25 కోట్లు

09) శిల్పా రావు -10 కోట్లు

10) పాలక్ ముచ్చల్ 8-9 కోట్లు