Begin typing your search above and press return to search.

చైనాలో టాప్ -10 భార‌తీయ‌ చిత్రాలివే!

ఇప్ప‌టి వ‌ర‌కూ టాప్ -10 లో బాలీవుడ్ సినిమాలే ఉంటూ వ‌చ్చాయి.

By:  Tupaki Desk   |   9 Jan 2025 2:30 PM GMT
చైనాలో టాప్ -10 భార‌తీయ‌ చిత్రాలివే!
X

భార‌తీయ సినిమాకు చైనా మార్కెట్ కూడా అత్యంత కీల‌క‌మైన‌ది. ఈ వ‌రుస‌లో ముందున్న ప‌రిశ్ర‌మ ఏది? అంటే అది క‌చ్చితంగా బాలీవుడ్ అనే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కూ టాప్ -10 లో బాలీవుడ్ సినిమాలే ఉంటూ వ‌చ్చాయి. కానీ తొలిసారి ద‌క్షిణాది నుంచి విజ‌య్ సేతుప‌తి న‌టించిన 'మ‌హారాజ్' కూడా ఈజాబితాలో చేరింది. ఓసారి చైనాలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రాలేవో చూస్తే..

అమీర్ ఖాన్ న‌టించిన 'దంగ‌ల్' చైనా నుంచి 1521 కోట్లు రాబ‌ట్టింది. ఆ త‌ర్వాత రెండ‌వ స్థానంలో అమీర్ చిత్ర‌మే నిలిచింది. ఆయ‌న న‌టించిన 'సీక్రెట్ సూప‌ర్ స్టార్' 874 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అటుపై ఆయుష్మాన్ ఖురానా, ట‌బు రాధికే ఆప్టే న‌టించిన 'అంధా ధున్' 380 కోట్లు రాబ‌ట్టింది. ఆ త‌ర్వాత స్థానంలో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన 'బ‌జ‌రంగీ భాయిజాన్' నిలిచింది. ఈ సినిమా 334 కోట్లు సాధించింది. అటుపై ఇర్పాన్ ఖాన్, స‌బా ఖ‌మ‌ర్ న‌టించిన 'హిందీ మీడియా' 246 కోట్ల వ‌సూళ్ల‌ను చైనా మార్కెట్ లో రాబ‌ట్టింది.

అలాగే రాణీ ముఖ‌ర్జీ, సుప్రియ పిల్గ‌వోక‌ర్ న‌టించిన 'హిచ్కీ' అక్క‌డ 175 కోట్లు సాధించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అమీర్ ఖాన్ మ‌రో రికార్డు సాధించారు. ఆయ‌న హీరోగా న‌టించిన 'పీకే' చిత్రం 138 కోట్లు రాబ‌ట్టింది. అలాగే అతిలోక సుంద‌రి శ్రీదేవి న‌టించిన 'మామ్' సినిమాకు అక్క‌డి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు. అక్క‌డ ఈసినిమా 132 కోట్లు సాధిం చింది. ఈ సినిమా హిందీ మార్కెట్ లో అంచ‌నాలు కూడా అందుకోలేదు.

ఇక అక్ష‌య్ కుమార్, భూమీ ప‌డ్నేక‌ర్ న‌టించిన 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ క‌థా' 110 కోట్లు రాబ‌ట్టింది. ఈ రేసులో నిలిచిన చివ‌రి చిత్రం కోలీవుడ్ ది కావ‌డం విశేషం. మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి న‌టించిన 'మ‌హారాజా' చైనాలో 91 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. చైనా మార్కెట్ లో టాలీవుడ్ హీరోలు ఇప్ప‌డిప్పుడే ఫేమ‌స్ అవుతున్నారు. ప్ర‌భాస్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ చిత్రాలు కూడా చైనాలో రిలీజ్ అవుతున్నాయి.