Begin typing your search above and press return to search.

రీరిలీజ్ హవా.. టాప్ 10 సినిమాల రికార్డులివే!

ముఖ్యంగా బుక్ మై షో ప్రీ సేల్స్ లో కొన్ని సినిమాలు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ సాధించాయి. ఈ ట్రెండ్ మరింత వేగంగా కొనసాగుతుందనే అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   14 March 2025 3:44 PM IST
రీరిలీజ్ హవా..  టాప్ 10 సినిమాల రికార్డులివే!
X

సినిమాలు ఒకసారి విడుదలై పోయాక కొన్నేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా 4K రీమాస్టర్ వెర్షన్‌లతో పాత క్లాసిక్ సినిమాలు తిరిగి విడుదల అవుతున్నాయి. ఓటీటీ విస్తరణతో థియేటర్ బిజినెస్ తగ్గుతుందనుకున్న తరుణంలో, రీరిలీజ్‌లకు మంచి ఆదరణ రావడం ఆశ్చర్యంగా మారింది. ముఖ్యంగా బుక్ మై షో ప్రీ సేల్స్ లో కొన్ని సినిమాలు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ సాధించాయి. ఈ ట్రెండ్ మరింత వేగంగా కొనసాగుతుందనే అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటి వరకు రీరిలీజ్ మూవీల్లో అత్యధిక ప్రీ సేల్స్ రికార్డు క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ఇంటర్ స్టెల్లార్ (234K) సాధించింది. తెలుగు సినిమాల్లో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 4K (175.2K) ఒక ట్రెండ్ సెట్ చేయగా.. అదే విధంగా మహేష్ బాబు మురారి 4K (166K), మాఫియా యాక్షన్ డ్రామా బిజినెస్ మాన్ 4K (134.4K) కూడా టాప్ 5 లిస్ట్‌లో నిలిచాయి. ఈ సినిమాలు విడుదలైనప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విధంగానే రీరిలీజ్ సమయంలోనూ అభిమానులను థియేటర్లకు రప్పించాయి.

లేటెస్ట్ గా మళ్లీ రీరిలీజ్ బజ్ పెంచిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC) 4K. మహేష్ బాబు - వెంకటేశ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమా 4K రీరిలీజ్‌లో 57K ప్రీ-సేల్స్ సాధించి, అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. వీరాభిమానులకే కాదు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఈ ఎమోషనల్ డ్రామా మళ్లీ స్క్రీన్‌పై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు.

ఇక తమిళ బ్లాక్‌బస్టర్ ఘిల్లి 4K కూడా మంచి స్పందన సాధించగా, చిరంజీవి ఇంద్ర 4K (64K) కూడా బాగానే ప్రీ-సేల్స్ రాబట్టింది. ఇక బాలీవుడ్ తరహాలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యె జవని హై దీవాని (42K), భయానక కథాంశంతో తెరకెక్కిన తుంబాడ్ (34.2K) కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. అయితే, నెక్స్ట్ రిలీజ్ కాబోయే ప్రభాస్ సలార్ ఇంకా వారం రోజులు ఉండగానే మంచి ప్రీ-సేల్స్ సాధించడంతో ఈ లిస్ట్‌లోని మరికొన్ని సినిమాలను అధిగమించే అవకాశం ఉంది.

టాప్ రీరిలీజ్ బుక్ మై షో ప్రీ-సేల్స్ రికార్డులు:

1. ఇంటర్ స్టెల్లార్ - 234K

2. గబ్బర్ సింగ్ 4K - 175.2K

3. మురారి 4K - 166K

4. బిజినెస్ మాన్ 4K - 134.4K

5. సనం తేరీ కసం - 133.9K

6. ఘిల్లి 4K - 88.7K

7. ఇంద్ర 4K - 64K

8. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 4K - 57K

9. యె యావని హై దీవాని - 42K

10. తుంభాడ్ - 34.2K

11. సలార్ - 27K (7 రోజులు మిగిలినవి)

12. ఆరెంజ్ 4K - 21.4K