Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ - ముఫాసా.. బుకింగ్స్ లో ఇంకా అదే జోరు

హాలీవుడ్ యానిమేషన్ సిరీస్ ది లయన్ కింగ్ నుంచి వచ్చిన ముఫాసాకి కూడా ఇండియాలో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.

By:  Tupaki Desk   |   4 Jan 2025 7:52 AM GMT
పుష్ప రాజ్ - ముఫాసా.. బుకింగ్స్ లో ఇంకా అదే జోరు
X

ఈ ఏడాది ఆరంభంలో ఇండియన్ బాక్సాఫీస్ నుంచి సంక్రాంతి వరకు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు. జనవరి 10న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ గ్లోవర్ వైజ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతోనే మరల సందడి మొదలు కాబోతోంది. అయితే ఈ లోపు థియేటర్స్ లో ఉన్న సినిమాలని చూసేందుకు ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు.

ముఖ్యంగా హాలీవుడ్ సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో పాటుగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న మలయాళీ హిట్ మూవీ ‘మార్కో’కి కూడా మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’కి కూడా మంచి స్పందన వస్తోంది. నెల రోజులు దాటిన తర్వాత కూడా ఇంకా వీకెండ్స్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది.

హాలీవుడ్ యానిమేషన్ సిరీస్ ది లయన్ కింగ్ నుంచి వచ్చిన ముఫాసాకి కూడా ఇండియాలో అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఓ విధంగా మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకి ఎక్కువ మంది వెళ్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. అందుకే బుక్ మై షోలో లాస్ట్ 24 గంటల బుకింగ్స్ లో ముఫాసా టాప్ ప్లేస్ లో ఉంది.

ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా బుక్ మై షో ద్వారా లాస్ట్ 24 గంటల్లో 58.07K టికెట్స్ బుక్ కావడం విశేషం. దీని తర్వాత రెండో స్థానంలో పుష్ప 2 ఉంది. ఈ మూవీ థియేటర్స్ లో 30వ రోజు కొనసాగుతోంది. ఈ చిత్రానికి బుక్ మై షోలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 56.19K టికెట్లు బుక్ అయ్యాయి. అలాగే ఉన్ని ముకుందన్ మార్కో సినిమా బుకింగ్స్ 39.89K అయ్యాయి. ఈ సినిమా 16వ రోజు థియేటర్స్ లో కొనసాగుతోంది.

ఓవరాల్ లో ప్రస్తుతం థియేటర్స్ లో ఆడుతోన్న సినిమాలకి టికెట్ బుకింగ్స్ క్రమం ఎలా ఉందో ఓ సారి చూసుకుంటే బేబీ జాన్ కి పబ్లిక్ నుంచి లీస్ట్ ఇంటరెస్ట్ కనిపిస్తూ ఉండటం గమనార్హం.

బుక్ మై షోలో లాస్ట్ 24 గంటల బుకింగ్స్

ముఫాసా (డే15) - 58.07K

పుష్ప 2 (డే30) - 56.19K

మార్కో (డే16) - 39.9K

ఐడెంటిటీ (డే2) - 39.89K

మ్యాక్స్ (డే10) - 17.48K

రైఫిల్ క్లబ్(డే16) - 11.13K

బేబీ జాన్ (డే10)- 8.57K