ఈ సింగర్స్ పాట చాలా కాస్ట్‌లీ!
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదు కానీ గత కొన్నేళ్లుగా వారికి కూడా చాలా ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు.
By: Tupaki Desk | 13 March 2025 10:00 PM ISTరిలీజ్ కావాల్సిన సినిమాకు హైప్ పెరగాలంటే అన్నికంటే ముఖ్యమైనది సినిమా ఆడియో. కేవలం పాటలు వల్ల యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఎన్నో సూపర్ హిట్లుగా నిలిచాయి. సినిమాల్లో పాటలకు, సంగీతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అలాగని కేవలం సాంగ్స్ ఒక్కటే సినిమాని నిలబడుతాయని కాదు. యావరేజ్ సినిమాను కూడా సాంగ్స్ నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాయని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి.
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదు కానీ గత కొన్నేళ్లుగా వారికి కూడా చాలా ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అనిరుధ్ అయితే రికార్డు బ్రేకింగ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అయితే నార్త్ లో ఇచ్చినట్టు సౌత్ లో సింగర్స్ కు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వరు. తెలుగులో పాటలు పాడినందుకు సింగర్స్ కు చాలా తక్కువ డబ్బు ఇస్తారు.
దేశంలోనే అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్ గా మొదటి ప్లేస్ లో ఉన్నారు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. రెహమాన్ సింగర్ మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్ కూడా. కానీ ఆయన పాట పాడాలంటే మాత్రం రూ.3 కోట్లు ఇవ్వాల్సిందేనట. రీసెంట్ గా ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రెహమాన్, ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇక సెకండ్ ప్లేస్ లో రూ.25 లక్షలతో శ్రేయా ఘోషల్ ఉన్నారు. ఏ భాష పాటనైనా, ఎలాంటి రాగమైనా దాన్ని నెక్ట్స్ లెవెల్ లో ప్రెజెంట్ చేయగల గాయని ఈమె. శ్రేయ ఒక పాట పాడాలంటే రూ.25 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. శ్రేయ తర్వాత సునిధి చౌహాన్ ఒక్కో పాటకు రూ.18 నుంచి రూ.20 లక్షలు తీసుకుంటుంది. ఎక్కువగా హిందీ సాంగ్స్ పాడే సునిధి చాలా ఫేమస్ లేడీ సింగర్.
ఇక తెలుగు, హిందీ భాషల్లో ఎక్కువగా బ్రేకప్ సాంగ్స్ పాడి పాపులరైన ఆర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్ కు రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షలు తీసుకుంటాడని తెలుస్తోంది. ర్యాపర్ గా బాగా ఫేమస్ అయిన బాద్ షా ఒక సాంగ్ పాడాడంటే ఆ సాంగ్ వందల మిలియన్ వ్యూస్ తెచ్చిపెట్టడం ఖాయం. ఆయన కూడా ఒక్కో పాటలకు రూ.18 నుంచి రూ.20 లక్షలు ఛార్జ్ చేస్తాడట.
ఇక ఎన్నో ఏళ్లుగా పాటలు పాడుతూ అందరికీ సుపరిచితుడైన సోనూ నిగమ్ ప్రస్తుతం ప్రతీ పాటకూ రూ.15 నుంచి రూ.18 లక్షలు తీసుకుంటున్నాడట. రీసెంట్ గా కన్సర్ట్‌లతో బాగా ఫేమస్ అయిన సింగర్ కమ్ యాక్టర్ దిల్జీత్ దోసాంజే ఒక్కో పాట పాడాలంటే రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనట. అదే స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే రూ.50 లక్షలు ముట్టజెప్పాల్సిందేనట.
ఎప్పుడూ ఏదొక కాంట్రవర్సీలో ఉండే హనీ సాంగ్ కూడా పాటకు రూ.10 లక్షలు తీసుకుంటాడట. హిందీ, పంజాబీ సాంగ్స్ ఎక్కువగా పాడుతూ, సింగింగ్ షో ల్లో జడ్జిగా బాగా ఫేమస్ అయిన నేహా కక్కర్ కూడా సాంగ్ కు రూ.10 లక్షలు డిమాండ్ చేస్తుందట. బాలీవుడ్ సాంగ్స్ ఎక్కువ పాడే మికా సింగ్ సైతం పాటకు రూ.10 లక్షలు తీసుకుంటాడట.