Begin typing your search above and press return to search.

2025లో వచ్చే పెద్ద హీరోల సినిమాలు ఇవే!

మొత్తానికి 2024లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా సినిమా ఇండస్ట్రీ ఫలితాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   24 Dec 2024 3:30 PM GMT
2025లో వచ్చే పెద్ద హీరోల సినిమాలు ఇవే!
X

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎప్పటిలాగే 2024లో అత్యధిక సినిమాలు వచ్చాయి. ఫలితాల విషయంలోనూ ఎప్పటిలాగే సక్సెస్‌ రేటు చాలా తక్కువ ఉంది. కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటే కొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్‌గా నిలిచాయి. సూపర్ హిట్‌ అవుతాయని భావించిన పెద్ద సినిమాలు అట్లర్‌ఫ్లాప్‌ కాగా, పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన చిన్న సినిమాలు పెద్ద విజయాలను సొంతం చేసుకున్నాయి. మొత్తానికి 2024లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా సినిమా ఇండస్ట్రీ ఫలితాలు ఉన్నాయి. చివర్లో వచ్చిన పుష్ప 2 సెన్షేషన్‌ క్రియేట్‌ చేయడం అందరికి తెలిసిందే.

2025లో టాలీవుడ్‌ పెద్ద స్టార్స్ నుంచి రాబోతున్న సినిమాల విషయానికి వస్తే గత ఏడాది రాని హీరోలు కొందరు వచ్చే ఏడాది రాబోతున్నారు. 2025 సంక్రాంతికి రామ్‌ చరణ్ గేమ్‌ ఛేంజర్‌, బాలకృష్ణ డాకు మహారాజ్‌, వెంకటేష్‌ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి సీజన్‌తో సినిమాల సందడి మొదలు కాబోతుంది. ఆ తర్వాత సమ్మర్‌లో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా విడుదల కాబోతుంది. అదే సమ్మర్‌లో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్‌ సినిమాను సైతం విడుదల చేసే విధంగా చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ నటిస్తున్న బాలీవుడ్‌ మూవీ వార్‌ 2 సైతం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

వచ్చే ఏడాదిలో స్టార్‌ హీరోల సినిమాలు వరుసగా రాబోతున్నాయి. బాలకృష్ణ డాకు మహారాజ్‌తో పాటు అఖండ 2 సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవి హీరోగా శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో రూపొందబోతున్న సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్‌ సినిమాతో పాటు ఫౌజీ సినిమాను చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు రెండూ వచ్చే ఏడాదిలో చిన్న గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న సినిమా సంబరాల ఏటి గట్టు, నాని నటిస్తున్న హిట్ 3, ప్యారడైజ్‌, నాగ చైతన్య నటిస్తున్న తండేల్‌ మూవీ, రవితేజ నటిస్తున్న మాస్‌ జాతర సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు క్రేజీ దర్శకుల సినిమాలు సైతం 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా 2024తో పోల్చితే 2025లో ఎక్కువ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అంతే కాకుండా సక్సెస్ ఛాన్స్‌లు ఎక్కువ ఉన్న సినిమాలు సైతం వచ్చే ఏడాదిలో రాబోతున్నాయి. 2024 ఆరంభంలో వచ్చిన మహేష్ బాబు 2025లో తన సినిమాతో వచ్చే అవకాశాలు లేవు. ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.