టాప్ హీరోయిన్‌కి వింత సమస్య
అదే సమయంలో ఒక అరుదైన రుగ్మతతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఓపెనైంది.
By: Tupaki Desk | 12 Sep 2024 3:15 AM GMTసన్యా మల్హోత్రా అద్భుతమైన పెర్ఫార్మర్ మాత్రమే కాదు.. చాలా నిజాయితీగా దాపరికం లేకుండా మాట్లాడే వ్యక్తి. ఇటీవల ఈ భామ తన జీవితం గురించి.. నటిగా ఎంపికల గురించి.. వివరించింది. అదే సమయంలో ఒక అరుదైన రుగ్మతతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఓపెనైంది. ఇది అరుదైన వింతైన రుగ్మత.
ఎల్లే ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సన్యా తనకు ఇంపోస్టర్ సిండ్రోమ్ అనే అరుదైన రుగ్మత ఉందని వెల్లడించింది. అంతేకాదు ఈ అరుదైన పరిస్థితిని ఎలా ఎదుర్కొంటోందో వెల్లడించింది. ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది గొప్ప విజయాలు సాధించే వ్యక్తులలో మేధస్సు, నైపుణ్యాలు లేదా విజయాలు ఉన్నా కానీ తమలో తామే తమకు ఉన్న సమర్థతను సందేహిస్తారట. ఈ సిండ్రోమ్ గురించి మాట్లాడుతూ సాన్యా ఇలా చెప్పింది. తన పట్ల తాను చాలా కఠినంగా ప్రవర్తించేదానని, తప్పులను కూడా క్షమించలేనని తెలిపింది. తాను ఆకర్షణీయమైన బాలీవుడ్ జీవితం గడుపుతున్నా.. తనను తాను ఒక మోసగత్తె అని భావిస్తుందట. నేను ఇంకా పనిలో ఉన్నానని అనుకుంటాను. ఇంపోస్టర్ సిండ్రోమ్ లేని వారికి అసూయకలిగిస్తాను`` అని తెలిపింది. కొన్ని నెలల్లో దీనిని ఎదుర్కోవడానికి నాకు మరింత కచ్చితమైన పరిష్కారం ఉందని నేను ఆశిస్తునట్టు వెల్లడించింది. తనమీద తానే సందేహించే అరుదైన పరిస్థితి ఇదని దీనిని బట్టి అర్థమవుతోంది.
ఒక సెలబ్రిటీలు `ఇంపోస్టర్ సిండ్రోమ్` గురించి బయటపడడం ఇదే మొదటిసారి కాదు. ఈ తరహా సిండ్రోమ్‌తో ఇబ్బంది పడిన వారిలో మరికొందరు ఉన్నారు.
విద్యా బాలన్
2023లో ఓ చాటింగ్ సెషన్ లో విద్యాబాలన్ ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో ఎలా ఇబ్బంది పడుతోందో తెలిపింది. ఫిలింఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక నిర్దిష్ట పరిస్థితిని మేనేజ్ చేయడానికి చాలా ఒత్తిడి ఉంటుందని బాలన్ వెల్లడించింది. ఇది ఒక రకమైన ఇంపోస్టర్ సిండ్రోమ్. నేను దానిని అధిగమించాను. నేను నెమ్మదిగా నన్ను నేను ఎలా అంగీకరిస్తున్నానో గమనించాను.. అని వెల్లడించింది. ఓ పట్టాన తానేం చేసినా అది తనకు నచ్చదు అని కూడా వెల్లడించింది.
ఎల్లీ గౌల్డింగ్
గాయని ఎల్లీ గౌల్డింగ్ కూడా తన ఇంపోస్టర్ సిండ్రోమ్ తన కెరీర్‌కి సక్సెస్ లేకుండా ఎలా నాశనం చేసిందో వెల్లడించింది. నా ఆందోళన చాలావరకు `ఇంపోస్టర్ సిండ్రోమ్` అని వైద్యులు చెప్పేవారు. దీని వల్లనే నేను సమస్యలు ఎదుర్కొంటున్నాను అని నాకు కచ్చితంగా తెలుసు. నన్ను నేను సరిగా నమ్మను. నేను ఆనందించడానికి అర్హురాలిని కాదని భావిస్తాను. దాని ఫలితంగా నా విజయాన్ని ఆనందించకుండా నాశనం చేసుకోవాలని కోరుకుంటాను.. అని తన వింతైన పరిస్థితి గురించి వెల్లడించింది.
బెల్లా హడిద్
2022లో మోడల్ బెల్లా హడిడ్ ఇంపోస్టర్ సిండ్రోమ్ ని ఎలా మ్యానేజ్ చేయాలో వెల్లడించింది. ఈ భామ వోగ్‌తో ఇలా చెప్పింది. ``నేను ఈ మోసగాడు సిండ్రోమ్ తో బాధపడుతున్నాను. నేను దేనికీ అర్హురాలిని కానని ప్రజలు భావించినట్టు ఊహిస్తాను.. ప్రజలు ఎప్పుడూ ఏదో చెప్పాలి.. కానీ నేను చెప్పేది ఏమిటంటే.. నా పరిశ్రమలో నా చుట్టూ ఉన్న వ్యక్తులు నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకున్నట్టు భావిస్తాను.. అని తెలిపింది. అభద్రతతో వ్యవహరించడం చాలా కఠినంగా ఉంటుంది. దాని గురించి బహిరంగంగా మాట్లాడిన ప్రముఖులకు ధన్యవాదాలు.