Begin typing your search above and press return to search.

తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలివే

ఇతర భాషలలో తెరకెక్కిన సినిమాలు కొన్ని సార్లు తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2024 7:19 AM GMT
తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలివే
X

ఇతర భాషలలో తెరకెక్కిన సినిమాలు కొన్ని సార్లు తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ ఉంటాయి. తమిళ్ స్టార్ హీరోలైన కమల్ హాసన్, రజినీకాంత్, సూర్య, కార్తీ, విశాల్, దళపతి విజయ్ కి తెలుగులో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే విజయ్ ఆంటోనీ, శివ కార్తికేయన్ తో మరికొంతమంది చిన్న హీరోలు కూడా తెలుగులో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

‘బిచ్చగాడు’ సినిమాతో విజయ్ ఆంటోనీ, ‘అమరన్’ మూవీతో శివ కార్తికేయన్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. కేవలం తమిళ్ హీరోలు మాత్రమే కాకుండా కన్నడ హీరో రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ సిరీస్ తో తెలుగులో 100 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకొని స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాగే మలయాళంలో మోహన్ లాల్ కి తెలుగునాట మంచి క్రేజ్ ఉంది.

దుల్కర్ సల్మాన్ అయితే తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడ స్టార్ హీరోగా తమ ఇమేజ్ పెంచుకుంటున్నాడు. ఇలా ఇతర భాషలలో స్టార్స్ గా ఉన్నవారు చాలా వరకు వారి డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యారు. ఇతర భాషల నుంచి తెలుగులో రిలీజ్ అయ్యి అత్యధిక ప్రాఫిట్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఉంది.

జైలర్ సినిమాని 12 కోట్లకి దిల్ రాజు కోనుగోలు చేయగా ఏకంగా 35.90 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. తరువాత రెండో స్థానంలో రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఉంటుంది. ఈ మూవీ తెలుగు రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు 50 కోట్లకి కొనుగోలు చేయగా ఏకంగా 34.25 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇక ‘కాంతారా’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ కేవలం 2 కోట్లకి తెలుగు డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఏకంగా 27.65 కోట్ల ప్రాఫిట్ వచ్చింది.

ఈ మూడు చిత్రాలు తెలుగులో అంచనాలకి మించి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. అలాగే ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో వసూళ్లు అందుకున్నాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమా కూడా తెలుగులో భారీ లాభాలని అందించింది. కేవలం 5 కోట్లతో ఈ సినిమా తెలుగు రైట్స్ ని కొనుగోలు చేశారు.

తెలుగులో టాప్ కలెక్షన్స్ అందుకున్న డబ్బింగ్ సినిమాలు

జైలర్ – 35.90 కోట్లు(12 కోట్ల థియేట్రికల్ బిజినెస్)

కేజీఎఫ్ చాప్టర్ 2 - 84.25 కోట్లు( 50 కోట్లు)

కాంతారా – 27.65 కోట్లు(2 కోట్లు)

అమరన్ – 23 కోట్లు(5 కోట్లు)***

బిచ్చగాడు – 16.30 కోట్లు(50లక్షల)